దేవిశరన్నవరాత్రులలో ప్రకృతిని ఆరాధించే పెద్ద పండుగ బతుకమ్మ పండుగ. అసమానతలను ఎదురిద్దాం...ఆత్మగౌరవంతో బతుకుదాం అంటూ ఆడపడుచులు ఉత్సాహంగా , ఆనందంగా ఎంతో సంబరంగా ఈ పండుగను జరుపుకుంటారు. ముత్తయిదువులంతా గౌరీదేవి దీవెనలను కోరుతూ... తమ మాంగల్య సౌభాగ్యం చల్లగా ఉండాలని ప్రార్థిస్తే, యువతులు తమకు మంచి భర్త లభించి, దాంపత్య జీవనం సుఖసంతోషాలతో సాగాలని వేడుకుంటారు. బతుకమ్మ పండుగ వచ్చే సమయానికి చెట్లు ఆకులతో అల్లుకుపోతాయి. భూమి పచ్చదనం పర్చుకుంటుంది. బతుకమ్మను తయారుచేసే తంగేడు, మునుగు, బంతి, చామంతి, గన్నేరు, జిల్లేడు, తామర, గుమ్మడి, గడ్డి పువ్వులు లాంటి రంగురంగుల పూలు వికసిస్తాయి. కుల, మతాలకతీతంగా వాడవాడలో జరుపుకునే బతుకమ్మ పండుగ ముఖ్య ఉద్దేశం ప్రకృతిని, మహిళలను గౌరవించాలని.
Sunday, 9 October 2016
Saturday, 1 October 2016
మహాత్ములు నేర్పిన పాఠాలు ... మనకు మార్గదర్శకాలు !
దేశంలోశాంతి, మతసామరస్యం నెలకొల్పేందుకు కృషిచేసిన మహాత్మాగాంధీ గారు చూపిన బాటలో పయనిద్దాం.... మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం..... దేశాన్ని అభివృద్ధి వైపు నడిపిద్దాం !
స్వచ్చమైన పరిపాలన అందించి, మచ్చలేని ప్రధానమంత్రిగా.... పొట్టివాడయినా మహాగట్టివాడని అందరి మన్నలను పొందిన లాల్ బహదూర్ శాస్త్రి గారిని గుర్తుచేసుకుందాం. ఈ తరంవారికి తెలియచేద్దాం !
మహాత్ములు నేర్పిన పాఠాలు ... మనకు మార్గదర్శకాలు !
Sunday, 18 September 2016
Wednesday, 14 September 2016
"జలధారలు"
వరునిదేవుడి కుండపోత ...నింగినుండి నేలవరకు జలధారలు... మూడురోజుల నుండి ఇదే తీరు. ఆకాశం నల్లని మేఘాలతో భూమి మీదికి విరుచుకుపడుతోంది. భూమి మీద ఉన్న అన్ని కాలుష్యాలను ప్రక్షాళన చేసే వరకు విశ్రమించకూడదని ఒట్టు పెట్టుకున్నట్టు... వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. పుడమి పులకరించి... చెరువులు జలకలతో మెరుస్తుంటే, పచ్చని చేలు మురుస్తున్నాయి.
Monday, 12 September 2016
త్యాగానికి చిహ్నం 'బక్రీద్'
ప్రతి పండుగ వెనుక ఒక సందేశం దాగి ఉంటుంది. అలాంటి సందేశాత్మక పండుగలలో మంచికోసం, మానవ సంక్షేమం కోసం పాటుపడుతూ త్యాగానికి ప్రతీతగా భక్తిభావంతో జరుపుకునే పండుగ 'బక్రీద్'. ఈ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ త్యాగం, పరోపకారం లాంటి సుగుణాలను అలవరచుకోవాలని కోరుకుంటూ, మిత్రులందరికీ 'బక్రీద్' పర్వదిన శుభాకాంక్షలు !
Friday, 9 September 2016
Subscribe to:
Posts (Atom)