ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలంటే ప్రకృతితో మమేకమవ్వాలి. దాంతో ఒత్తిడి తగ్గిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుంది. గత నెల రోజులుగా మండుతున్న ఎండలకు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సమయంలో ఒక్కసారిగా భారీ వర్షం కురిసి వాతావరణం ఆహ్లాదంగా మారడంతో, ప్రకృతి ప్రేమికులు ఆనందంతో పరవశించిపోయారు. చల్లదనాన్ని మదిలో నింపుకొని మేఘాలలో తేలిపోయేలా తన్మయభరితం.