”శోధిని”

Tuesday 24 November 2015

కార్తీక దీపం !



మాసాలలో కార్తీక మాసం, తిధుల్లో పున్నమి పవిత్రమైనవి.  ఈ రెండూ సమన్వయం కార్తీక దీపం.   ఈ  రోజున శివాలయాలలో దీపారాధన చేయడం వలన ముక్కోటి దేవతలను పూజించిన పుణ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఉపవాసాలు, అభిషేకాలు, వ్రతాలు, ప్రత్యేక పూజలు, దీపారాధనలతో   కార్తీక పౌర్ణమి నాడు గృహాలు, దేవాలయాలు కళకళ లాడుతూ ఉంటాయి.   దీపాల వరుస చూస్తుంటే, ఎంతో రమ్యంగా, నేత్రపర్వంగా, హృదయానందకరంగా ఉంటుంది.