
ప్రకృతి సోయగాల్ని, హృదయపు లాలిత్యాన్ని మేళవించిన పాటలు పరిమళిస్తాయ.
మనసున నిలిచి మధురానుభూతిగా మిగులుతాయి. 'మల్లీశ్వరి' చిత్రంలోని ఈపాట ఈ కోవలోకే వస్తుంది.
మనసున మల్లెల మాలలూగెనె
కన్నుల వెన్నెల డోలలూగెనె
ఎంత హాయి ఈ రేయి నిండెనో
ఎన్నినాళ్ళకి బ్రతుకు పండెనో
కొమ్మలు గువ్వలు గుసగుస మనినా
రెమ్మల గాలులు ఉసురుసురనినా
అలలు కొలనులో గలగలమనినా
దవ్వుల రేణువు సవ్వడు వినినా
నువ్వు వచ్చేవని -నీ పిలుపే విని
కన్నుల నీరిడి కలయ చూసితిని
గడియ ఏని ఇక విడిచి పోకుమా
ఎగసిన హృదయం పగుల నీకుమా
ఎన్ని నాళ్ళకీ బ్రతుకు పండెనో
ఎంత హాయి ఈ రేయినిండెనో
చిత్రం: మల్లీశ్వరి
రచన: దేవులపల్లి కృష్టశాస్త్రి
గానం: భానుమతి
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు