”శోధిని”

Thursday, 30 January 2014

ప్రేమ పరిమళాలు!



ప్రకృతి సోయగాల్ని...   
హృదయపు లాలిత్యాన్ని...  
మేళవించిన నీ గానం 
మధురాతి మధురం! 
సౌకుమార్యంతో  కూడిన 
నీ తీయటి పలుకులు ...  
అత్యంత మనోహరం!! 
నీ రూపురేఖలు 
శిల్పకళా సంపదలు 
నా అణువణువులోనూ 
నీ సొగసులు, సోయగాలు...  
నా గుండె గుడిలో వెలసిన
ప్రేమ పరిమళాలు!  

4 comments:

Meraj Fathima said...

చక్క్కటి భావాలు. చాలా బాగుంది చిన్ని కవిత.

gajula sridevi said...

ప్రేమ పరిమళాలు బాగున్నాయి నాగేంద్రగారు.చాలా బాగుంది.

కాయల నాగేంద్ర said...

ధన్యవాదాలు ఫాతిమా గారు, శ్రీదేవి గారు!

Creative Channel said...

కోనసీమ సోయగాల్ని రొమాంటిక్ గా చిత్రీకరించిన సాంగ్
ప్రతి ఉదయం నీ పిలుపే
హృదయంనే కదిలించే
మనసే పులకించే
Prati Udayam Nee Pilupe - Romantic Melody Song from Prema Entha Madhuram
Song Link: https://youtu.be/Z9qVLatW6dQ