ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు సంక్రాంతి సందర్భంగా విడుదలయ్యాయి. మహేష్ నటించిన '1-నేనొక్కడినే' 10న చరణ్ హీరోగా నటించిన 'ఎవడు' 12న ప్రక్షకుల ముందుకు రావడంతో 2014 సంక్రాంతి బరిలో హోరా హోరీ పోరు ప్రారంభమయింది. అయితే భారీ అంచనాలతో ముందుగా వచ్చిన '1- నేనొక్కడినే' డివైడ్ టాక్ రావడంతో 'ఎవడు' సినిమాకు క్రేజ్ ఏర్పడింది. ఈ చిత్రం కూడా ప్రేక్షకుల అంచనాలను తలక్రిందులు చేసినా 'పర్వాలేదు' అనే టాక్ రావడంతో 'ఎవడు' నిలదొక్కుకొగలదని విశ్లేషకుల అభిప్రాయం. ఈ రెండు సినిమాలు ఒకటి యాక్షన్, రెండోది మాస్ చిత్రాలు కావడంతో అభిమానులను అలరిస్తాయి. కాని, సామాన్య ప్రేక్షకులకు అంతగా రుచించక పోవచ్చు. 2013 సంక్రాంతి కి ఈ ఇద్దరి హీరోల సినిమాలు రిలీజయి విజయం సాధించాయి. ఇద్దరూ సంక్రాంతి హీరోలుగా నిలిచారు. ఈ సారి కుడా ఈ ఇద్దరు రిపీట్ చేస్తారా? లేదా అని తెలియాలంటే ఈ వారం గడవాలి. అయితే సంక్రాంతి విజేతగా నిలిచే అవకాశాలు 'ఎవడు' చిత్రానికి ఎక్కువగా ఉన్నాయనిపిస్తోంది.