”శోధిని”

Thursday 12 November 2015

దానిమ్మ గింజలు !



ఎర్రగా...ఎంతో ఆకర్షణీయంగా మెరిసిపోయే దానిమ్మ గింజలు మన ఆరోగ్యానికి ఏంతో  మేలు చేస్తాయి.  ఇవి శరీరంలో రక్త ప్రసరణను వేగవంతం చేస్తూ వృధాప్యాన్ని దూరం చేస్తాయి.  జీర్ణక్రియను మెరుగు పరచి, ఎముకులు గట్టిపడటానికి   దోహదపడతాయి.  వయసు పెరిగేకొద్దీ చర్మంపై ఏర్పడే ముడతలను దానిమ్మ రసం నివారిస్తుంది.  నోటిపూత  నుంచి ఉపశమనాన్ని కలుగచేస్తూ దంతాలు, చిగుళ్ళు గట్టిపడేలా చేస్తాయి.  ఇలా చెప్పుకుంటూ పొతే దానిమ్మ గింజల వల్ల బోలెడు  లాభాలున్నాయి.