”శోధిని”

Tuesday 31 January 2017

"రాణివాసం"



అప్సరస లాంటి స్త్రీ మూర్తిని సృష్టించాలని  అలుపెరగకుండా బొమ్మను తయారుచేయడంలో నిమగ్నమై ఉన్న బ్రహ్మదేవుడిని  చూసిన మన్మధుడు చిరునవ్వును చిందిస్తూ  పూల బాణాన్ని వదిలాడు.  అంతే, ఒక్కసారిగా బ్ర్రహ్మదేవుడిలో కొత్త ఉత్సాహం ఆవహించింది.  సన్నజాజులు, మల్లెలు, కలువపూలు, గులాబీలు, మందారాలను కుప్పగా పోసి రంగరించి అపురూపమైన బొమ్మను తయారు చేశాడు.  అప్పటినుంచి భూలోకంలో కవులకి కధానాయిక దొరికింది.  అప్పటివరకు రాజకుమారి అంటే ఎలా ఉంటుందో తెలియని దర్శకులకు  ఇలా ఉంటుందని తెల్సింది.  నడకలో రాణివాసఠీవి, నవ్వుల్లో చల్లని వెన్నెల, చూపుల్లో వలపులతో పాటు రాజసం... వీటన్నిటి కలయికే మన అందాల రాకుమారి శ్రియ.

 

Monday 23 January 2017

హింసపై విసురుదాం పంచ్ !

ఆడబిడ్డను బ్రతకనిద్దాం ...
ఆమెకు బతుకునిద్దాం !

Friday 13 January 2017

సంక్రాంతికి సుస్వాగతం !!



మన సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ ...  ప్రకృతికి, మానవునికీ మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని సూచిస్తూ ... తెలుగుదనం ఉట్టిపడే మకర సంక్రాంతికి స్వాగతం !  ఆప్యాయతలు, అనురాగాలు , బంధాలు, అనుబంధాల సమ్మేళన  సిరుల స్రవంతి సంక్రాంతికి సుస్వాగతం !!


Sunday 8 January 2017

నేడు ముక్కోటి ఏకాదశి !

పవిత్రమైన ముక్కోటి ఏకాదశి కోసం వేయి కళ్ళతో ఎదురు చూసిన భక్తజనం శ్రీవారి  ఉత్తర దివ్యదర్శనంతో పులకించి, తరించి  భక్తి పారవశ్యంలో మినిగి పోయారు. ఎటు చూసిన అన్నమయ్య కీర్తనలు, భజనలు, కోలాటాలు, గోవిందనామస్మరణలతో దేవాలయాలు కిటకిటలాడాయి. 

మిత్రులందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు !