Friday 3 May 2013
నేస్తం... నేవ్వే సమస్తం!
మనకో మంచి స్నేహితుడు కావాలంటే, ముందుగా మనం మంచి స్నేహితుడిగా మారాలి. మనం వారిని అర్థం చేసుకోగలిగితే స్నేహం చిరకాలం ఉంటుంది. స్నేహం కలకాలం సాగాలంటే చిత్తశుద్ధి, నిజాయితీ, నిబద్ధత అవసరం. మనసారా, మనస్పూర్తిగా స్నేహం చేసినప్పుడే ఆ స్నేహం మంచి పరిమళాలు వెదజల్లుతూ స్నేహ కుసుమాలను వికసింపజేస్తుంది. నిజమైన స్నేహితులు ఎన్ని గొడవలు జరిగినా,ఎన్ని ఆపదలు వచ్చినా మళ్ళీ కలిసిపోతారు . అలాంటివారు కలసి చివరిదాకా స్నేహితులుగా మిగిలిపొతారు. అవసరం కోసం వాడుకొనేవాడు నిజమైన స్నేహితుడు కాలేడు. అలాంటివాళ్ళు మనతో కొంత దూరమే పయనించి తర్వాత విడిపోతారు. స్నేహితుడంటే మన కోసం తన జీవితాన్ని త్యాగం చేయిగలిగే మనస్సు ఉంటె చాలు. కాని, ఈ లోకంలో ఎక్కడో వేలల్లో ఒకరు ఇలాంటి స్నేహితుడు ఉంటారు. అలాంటి మంచి స్నేహితుడు ఒక్కరు దొరికినా చాలు జీవితం ఆనందమయం అవుతుంది. ఇలాంటి స్నేహితుల్ని సంపాదించు కోగలిగిన వారు చాలా అదృష్టవంతులు.
Subscribe to:
Posts (Atom)