ప్రతి జీవితానికి ప్రేమ ఒక దివ్య ఔషదం లాంటిది. అందుకే ఈ ప్రపంచంలో ప్రేమను కోరుకోని ప్రాణి అంటూ ఉండదంటే అతిశయోక్తి కాదు. పావురాళ్ళు ఒక్కసారి జతకడితే జీవితమంతా తమ బంధాన్ని కొనసాగిస్తాయి. అలాంటి ప్రేమ అతిమధురంగా ఉంటుంది. జున్నులా మెత్తగా హృదయాన్ని హత్తుకునే ఆత్మీయ భావంలా ఉంటుంది. ఎలాంటి స్వార్థం లేకుండా జీవితాంతం పవిత్రంగా తోడుగా నిలుస్తుంది...మనసును ఆహ్లాదపరుస్తుంది. మదిలో ఉత్తేజాన్ని, నూతనోత్సాహాన్ని నింపుతుంది. దాంతో ఆత్మీయత పెరిగి రెండు మనసులు దగ్గరవుతాయి. ఒకరి అభిప్రాయాలు మరొకరు స్వేచ్చగా, నిర్మొహమాటంగా చెప్పుకునే అవకాశం కలుగుతుంది. జీవితం ఆనందమయం అవుతుంది. మనుషుల మద్య ప్రేమ అనేది లేకుంటే భవిష్యత్తు శూన్యం అనిపిస్తుంది. జీవితం అందకారమనిపిస్తుంది. ఈ భూమ్మీద మనుషులు ఉన్నంత కాలం ప్రేమ బతికే వుంటుంది. పువ్వులో దాగి వుంది మకరందం...ప్రేమలో దాగి వుంది అనుబంధం. ప్రేమను ప్రేమించు... ప్రేమను బ్రతికించు.