
ఇవాళ ధరిత్రీ దినోత్సవం.
నాయకులు కాలుష్యనివారణ గురించి ప్రసంగిస్తారు. మొక్కల్ని నాటమంటారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించమంటారు. కానీ, వాళ్ళు మాత్రం ఇవేమీ చేయరు. నీతులు చెప్పడం ఇతరుల కోసమేనని వాళ్ళ ఉద్దేశం కాబోలు.
లక్షలాదిలా పెరిగిపోతున్న వాహనాలు, వాటి నుంచి వెలువడుతున్న కాలుష్యం దేశాన్ని కలవరపెడుతున్న సమస్య. పెరుగుతున్న కాలుష్యంతో జీవన విధానం గతి తప్పుతోంది. నగరాలలో పరిశ్రమలు విడిచి పెడుతున్న పొగ జీవ రాసులకు సెగగా మారింది. దీనికితోడు పెరిగిపోతున్ననగరీకరణ మరింత కాలుష్యరహితసమాజాన్నివృద్దిచేస్తోంది. లక్షలాదిలా పెరిగి పోతున్న వాహనాలు, వాటి నుంచి వెలువడుతున్న కాలుష్యం దేశాన్ని కలవరపెడుతున్నసమస్య. భూమి, నీరు, గాలి అన్నీ కలుషితమయి పోతున్నాయి. దీనికితోడు ప్లాస్టిక్ వినియోగం పరిసరాలకు, వాతావరణానికి, పర్యావరణానికి ప్రమాదకరమని తెలిసినా ప్లాస్టిక్ వస్తువులను విచ్చలవిడిగా వాడుతున్నారు. ఏ నగరంలో చూసినా, ఏ యాత్రా స్థలంలో చూసినా ప్లాస్టిక్ దుర్గంధం పెచ్చరిల్లుతోంది. పెళ్ళిళ్ళలో వందలాది ప్లాస్టిక్ వస్తువులను వాడి పడేస్తున్నారు. విందు వినోదాలపేరట ప్లాస్టిక్ ప్లేట్లు కూడా వచ్చాయి. మనిషి ఆరోగ్యానికి ప్రమాదకరమని తెలిసి కుడా ప్లాస్టిక్ వినియోగానికి విపరీతంగా అలవాటు పడటం ధరిత్రికి పెద్ద వపత్తని మనిషి తెలుసుకోలేకపోతున్నాడు. ప్లాస్టిక్ వస్తువులు పచ్చదనాన్నినాశనం చేస్తున్నాయి. నీటిని కలుషితం చేస్తున్నాయి.అంతేకాకుండా పరిసరాలను విషపూరితం చేస్తున్నాయి.
ప్లాస్టిక్ లేని రోజుల్లో మన జీవన విధానం ఎలా ఉండేది ...మనకున్న ఉపకరనాలేమిటో గుర్తుకు తెచ్చుకుని ఎవరికి వారు ప్లాస్టిక్ వాడకం పట్ల తమకు తాము నిషేధం విధించుకోవాలి. కాలుష్యకోరల్లో చిక్కుకొని అల్లాడుతున్న భూమాతను రక్షించుకోవాలి. మనిషి అప్రమత్తతే ధరిత్రికి బాసట.