”శోధిని”

Thursday 26 April 2012

'ప్రజాపథం'



     రాష్ట్రంలో అట్టహాసంగా మొదలయిన 'ప్రజాపథం' జనం లేక వెలవెల పోతోంది.  ప్రజల స్పందన లేకపోవడంతో ప్రజాప్రతినిధులు తలలుపట్టుకుంటున్నారు.  గతంలో ఇచ్చిన ఫిర్యాదులకు ఇప్పటివరకు పరిష్కారం లభించకపోవడంతో ప్రజలు కార్యక్రమాన్ని పట్టించుకోవడం లేదు.  ఎన్నో ఆశలు పెట్టుకున్న కార్యక్రమం అబాసుపాలవుతోంది. స్థానిక నాయకులు కార్యక్రమం పట్ల ఎలాంటి శ్రద్ధ కనబరచకపోవడంతో ఏదో మొక్కుబడిగా నిర్వహిస్తున్నారు. విధంగా చూస్తే ప్రభుత్వంపై వ్యతిరేకత  ప్రజలల్లో ఇంత తీవ్రంగా వుందో తెలుస్తోంది. మధ్య నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు విపరీతంగా పెరిగి సామాన్యప్రజలకు దడ పుట్టిస్తున్నాయి.  అదేసమయంలో విద్యుత్ చార్జీలు పెంచి మరింత బారం మోపారు.  రాష్ట్రంలో మద్యం విచ్చలవిడిగా దొరుకుతుంది కానీ, గొంతు తడుపుకునేందుకు గుక్కెడు మంచినీళ్ళు దొరకడం లేదు.  రోడ్లపరిస్థితి మరీ అద్వానంగా వుంది. కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవడంలేదు. అన్నీ రంగాలలోనూ ప్రభుత్వం విఫలమవడంతో  తన ఉనికిని చాటుకోవడానికే ప్రజాపథం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు తప్ప నిజంగా ప్రజా సమస్యలను పరిష్కరించడానికి కాదని ప్రజలు గ్రహించారు. ఇప్పటికైన రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని ప్రజలకు కావలసిన కనీస సౌకర్యాలను కల్పించడం పైన దృష్టి మల్లిస్తే బాగుంటుంది.