”శోధిని”

Tuesday 29 January 2019

జొన్నవాడ కామాక్షి అమ్మవారు


నెల్లూరు పట్టణానికి 10 కిలోమీటర్ల  దూరంలో  ఉన్న జొన్నవాడ  కామాక్షి  అమ్మవారు స్వయంగా కైలాసం నుంచి ఇక్కడికి వచ్చి వెలసినట్టు స్థలపురాణం చెబుతోంది.  ఇక్కడ అమ్మవారికి జరిగే ప్రత్యేక పూజ దేశంలో మరే  దేవాలయంలో జరగదని స్థానికులు చెబుతారు.  ఈ పూజకు అత్యంత శక్తి ఉందని భక్తులు నమ్ముతారు.  

Sunday 27 January 2019

వేదగిరి నరసింహుడు


నెల్లూరు పట్టణానికి 12 కిలోమీటర్ల  దూరంలో   శ్రీ లక్ష్మిసమేతుడైన నరసింహ స్వామి వేదగిరి గుట్టపైన  ఆవిర్భవించి పూజలందుకుంటున్నాడు. 

Friday 25 January 2019

70 వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు !














కుల-మత, చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా అందరూ ఎంతో ఉత్సాహంగా జరుపుకునే జాతీయ పండుగ గణతంత్ర దినోత్సవం.   మన రాజ్యాంగాన్ని తయారుచేయడానికి ఎంతో మంది మేధావులు ఎన్నో దేశాల రాజ్యాంగాలను పరిశీలించి రూపొందించారు.   మన రాజ్యాంగాన్ని రూపొందించిన తర్వాత  డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ మొదటి రాష్ట్రపతిగా గణతంత్ర  దినోత్సవం జరుపుకోవడం జరిగింది.   ఆ రోజు నుంచి భారతదేశం పూర్తిగా ప్రజా ప్రభుత్వంగా రూపుదిద్దుకుంది.  గణతంత్ర రాజ్యం అంటే ప్రజలే ప్రభుత్వం, ప్రభుత్వమే ప్రజలు అని అర్థం.  కానీ, ఆ అర్థం కాస్త నేడు  రాజకీయనాయకులే ప్రభుత్వం,  ప్రభుత్వమే రాజకీయనాయకులుగా మారిపోయింది.  70 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మనదేశానికి తమ జీవితాన్ని అర్పించిన ఎందరో వీరుల త్యాగఫలాన్ని స్మరించుకుందాం.


Friday 18 January 2019

తిరుపతి శ్రీవారి మెట్లు దగ్గర శ్రీవారి పాదాలు


నేడు 'అన్న' గారి వర్థంతి

నటుడిగా, దర్శకుడిగా, ముఖ్యమంత్రిగా తెలుగుజాతి మన్నలను పొంది, సాంఘీక, జానపద, పౌరాణిక, చారిత్రిక చిత్రాలలో నటించి, తెలుగు సినీ నందనవనంలో వెల్లివిరిసిన నవరస భరిత పారిజాతం యన్.టి.ఆర్. తెలుగువారి గుండెల్లో 'అన్న' గా ముద్రవేసుకున్న మరపురాని మరువలేని మహానటుడు నందమూరి తారక రామారావు గారి వర్థంతి సందర్భంగా...




Monday 7 January 2019

శక్తి స్వరూపిణి కామాక్షీదేవి అమ్మవారు

కామాక్షి అమ్మవారి దేవాలయం కంచి లో ఉన్న ప్రముఖ దేవాలయం. ఇక్కడ ప్రతిరోజూ ప్రాతఃకాలంలో శ్రీ కామాక్షి దేవి ఉత్సవ మూర్తిని మేలుకొలిపి, ప్రాతఃకాల నైవేధ్యం సమర్పించి హారతి ఇచ్చి, కామాక్షిదేవి ఉత్సవ మూర్తిని పల్లకిలో ప్రదక్షిణగా ఆలయంలోకి తీసుకొని వెళ్తారు. ఆ తర్వాత కామాక్షి దేవికి ఎదురుగా గోపూజ చేస్తారు. గోపూజ అయిన తర్వాత అమ్మవారి ద్వారానికి ఉన్న తెర తొలిగించి హారతి యిస్తారు. మనం అమ్మవారి విశ్వరూప దర్శనం చేసుకోవచ్చు. శ్రీ కామాక్షి దేవి దివ్య మంగళ రూపం నయన మనోహరం. 

Friday 4 January 2019

విద్యుద్దీపాలతో తిరుమల


కొత్త సంవత్సర వేళ ... విద్యుద్దీపాలతో తిరుమల శ్రీవారి ఆలయాన్ని  అలంకరించడంతో ఆలయం చుట్టూ  జిగేల్ మనే విద్యుత్ వెలుగుల హరివిల్లు.  

Wednesday 2 January 2019

అత్యంత పవిత్ర స్థలం రామేశ్వరం

రామనాథ స్వామి దేవాలయం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి.  తమిళనాడుకు చెందిన రామేశ్వరం ద్వీపంలో ఉన్న ప్రసిద్ధ హిందూ శైవక్షేత్రం.  ఈ దేవాలయం రామేశ్వరం అనే ద్వీప పట్టణంలో ఉంది.   ఈ దేవాలయంలో శివుడు "జ్యోతిర్లింగం"గా కొలువబడుతున్నాడు. ఈ దేవాలయ ప్రధాన దైవం "రామనాథస్వామి" (శివుడు). ఈ దైవం లింగాకారంలో ఉంటుంది. ఈ దేవాలయ గర్భగుడిలో రెండు లింగాలు ఉంటాయి. వాటిలో ఒకటి రాముని భార్య సీతమ్మవారు తయారుచేసిన ఇసుక లింగంరెండవది హనుమంతుడు కైలాసము నుండి తెచ్చిన విశ్వలింగం.