”శోధిని”

Wednesday 13 July 2022

గురు పౌర్ణమి శుభాకాంక్షలు!


ఉపాధ్యాయ వృత్తి ఏంతో గౌరప్రదమైనది. తల్లిదండ్రుల తర్వాత మనిషి వ్యక్తిత్వ వికాసంలో అధ్యాపకులదే కీలక పాత్ర. విద్యార్థులు ఉన్నతస్థాయికి చేరుకున్నారంటే అందులో ముఖ్యపాత్ర ఉపాధ్యాయులదే. విద్యార్థులు కుడా గురువులను గౌరవించినప్పుడే వారి ఆశయం నెరవేరుతుంది. విద్యను ప్రసాదించే గురువుల పట్ల భక్తి, గౌరవం కలిగి ఉండటం శిష్యుల కర్తవ్యం. అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే గురువులు పరబ్రహ్మ స్వరూపులు. అజ్ఞానమనే అంధకారాన్ని పోగొట్టి జ్ఞానమును ఇచ్చేవారు గురువులు కాబట్టి వారిని దైవంగా భావించాలి. ఆధ్యాత్మిక గురువుగా, భగవంతునిగా భక్తుల హృదయాలలో కొలువైనవున్న షిరిడీ సాయిబాబా గురు పూర్ణిమ మహాత్యాన్ని తెలియజెప్పిన సద్గురువు. గురు పౌర్ణమి సందర్భంగా దైవస్వరూపులయిన గురువులందరికీ ప్రణామములు.