నటనకు ప్రాధాన్యత ఇచ్చే నిత్యా మీనన్ 'గుండె జారి గల్లంతయ్యిందే' సూపర్ హిట్ కావడంతో ఆమె డిమాండ్ ఒక్క సారిగా పెరిగిపోయింది. ఆమెతో చిత్రాలు నిర్మించేందుకు నిర్మాతలు పోటి పడుతున్నారు. అయితే వచ్చిన అవకాశాలను ఒప్పుకోకుండా కేవలం నటనకే ప్రాధాన్యత వున్న పాత్రలనే ఎన్నుకుంటోంది. తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందుతూ వరుస హిట్లు సాధిస్తోంది. తొలి చిత్రం నుంచి కథల ఎంపికలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ, తన డబ్బింగ్ ను తనే చెప్పుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. 'అలా మొదలైంది', 'ఇష్క్', 'గుండె జారి గల్లంతయిందే' చిత్రాలలో తెలుగు ప్రేక్షకుల మతి పోగొట్టిన ఈ కేరళ కుట్టి మహా గట్టిది. ఎందుకంటే ఈ మధ్యనే పైలెట్లను ఎలా మాయచేసిందో తెలియదు కాని బెంగుళూరు నుంచి హైదరాబాద్ వచ్చే విమానంలో పైలెట్లు వుండే కాక్ పిట్ లో కూర్చుని ప్రయాణం చేసిందట. ఆమె సరదా తీరింది కాని ఆమెను కాక్ పిట్ లోకి అనుమతించిన పైలెట్లు ఇద్దరు సస్పెన్స్ కు గురయ్యారు పాపం.