ఉన్నతమైన వ్యక్తిత్వం, సేవాగుణం వల్లనే మనిషికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఎదుటి వ్యక్తి నుంచి గౌరవం పొందాలనుకునేవారు ముందుగా తామే ఎదుటివారిని గౌరవించడం నేర్చుకోవాలి. మల్లెపువ్వు సువాసన అందర్ని అలరించినట్టు, మానవత్వం కారణంగానే మనిషి అందరి మనస్సుల్లో నిలిచి ఉంటాడు. మనిషి మనుగడ సవ్యంగా సాగాలంటే, నీతి నిజాయితీ తప్పకుండా పాటించాలి. మనిషి ఎంత ఎత్తు ఎదిగినా వినయం, విధేయత, నీతి నిజాయితీలను వీడరాదు. నియమ, నిబద్దలతో జీవిస్తే మనిషిజన్మ ధన్యమవుతుంది.