”శోధిని”

Sunday 16 September 2012

మట్టి విగ్రహాలను ప్రతిష్టించండి ...పర్యావరణాన్ని కాపాడండి!



వినాయకుడిని తొమ్మిది రోజులు భక్తి శ్రద్ధలతో పూజించిన తర్వాత  విగ్రహాలను నదుల్లో, చెరువుల్లో నిమర్జన చేయడం ఆనవాయితీ.  అయితే ఈ విగ్రహాలను తయారు చేయడంలో రసాయనాలతో కూడిన రంగులు ఉపయోగించడం వల్ల జలాశయాలు కలుషిత మవుతున్నాయి. దాంతో పర్యావరణానికి పెద్ద ముప్పు వాటిల్లుతోంది.  అందుకే పర్యావరణ పరిరక్షణ కాపాడటానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ఇందులో భాగంగా మనం ఇంట్లో, కాలనీలలో,  ప్రతిష్టించే వినాయక విగ్రహాలను రసాయనాలను ఉపయోగించనివిగా, సాద్యమైనంత వరకు చిన్నవిగా ఉండేటట్లు చూడాలి.  మట్టి విగ్రహాలను పసుపు, కుంకుమ, పూలతో అలంకరించితే  చూడ ముచ్చటగా ఉంటాయి.  విగ్రహాలను నిమర్జన చేసినప్పుడు నీటిలో పూర్తిగా మునిగి పోవాలి.  అప్పుడే నిమర్జనకు అర్థం పరమార్థం.  పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని రంగులు ఉపయోగించని విగ్రహాలను ప్రతిష్టించండి .  ఇది ప్రజలందరికి సంబంధించిన అంశం.  జలాశయాలు కలుషితం కాకుండా  చూడాల్సిన భాద్యత  మనందరిపైన ఉంది. ప్రతి ఒక్కరూ చిన్న మట్టి విగ్రహాలను  ప్రతిష్టించి పూజించండి ...పర్యావరణాన్ని కాపాడండి.