టీవిలో సీరియల్స్ లేని సమయంలో ఇద్దరు మహిళామణులు మాట్లాడుకుంటున్నారు-
మొదటి మహిళ : మా వారికి ముందు చూపు ఎక్కువ !
రెండో మహిళ : అయితే బాగా పొదుపు చేస్తారన్నమాట!
మొదటి మహిళ : అంతలేదు ... నాతొ గొడవ మొదలవగానే ముందు జాగ్రత్తగా హెల్మెట్ పెట్టుకుంటాడు
రెండో మహిళ : మా వారే నయం... నాకు కోపం తెప్పించకుండా ఇంటి పనులన్నీ తనే చేసిపెడతాడు.