మాతృభాషలో చదవడం చిన్నప్పటినుంచే ప్రారంభం కావాలి. కనీసం పదవ తరగతి వరకైనా మాతృభాషలోనే విద్యాబోధన జరగాలి. జీవనోపాధికోసం ఇతర భాషలను నేర్చుకోవడంలో తప్పులేదు. కానీ, మనల్ని మనం ఆవిష్కరించుకోవడం మాత్రం మాతృభాషలోనే సాధ్యపడుతుంది. తెలుగువారు తెలుగుభాషను ప్రేమించాలి.... గౌరవించాలి... అమ్మలా ఆదరించాలి.