”శోధిని”

Friday 11 September 2015

గణేష్ ఉత్సవాల సందడి !

      


వినాయకచవితికి చందాలు వాసులు చేసే కార్యక్రమం మొదలయింది.  నిర్వహకులు పెద్ద విగ్రహాలను ప్రతిష్టించాలని చూస్తున్నారు తప్ప,  తర్వాత ఏర్పడే పర్యావరణ కాలుష్యాన్ని గురించి  ఆలోచించడం లేదు.  వినాయకుని విగ్రహాలు ప్రతిష్టించే వారు ఎత్తు తక్కువున్న మట్టి గణనాథులను ప్రతిష్టిస్తే, పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు చేతి వృత్తుల వారికి సహకారం అందించిన వారవుతారు.  కొందరు వెకిలితనంతో వినాయకుడు ఫిడేల్ వాయుస్తున్నట్టుగా, మద్దెల మోగిస్తున్నట్టుగా, మోటారుసైకిల్ మీద వెడుతున్నట్టుగా  ఎవరి వంకర బుర్రకు ఏ ఆలోచన తడితే ఆ తీరుగా వినాయకుడుని తయారుచేస్తూ మహా అపచారం చేస్తున్నారు.  ఈ విపరీత ధోరణి మారాలి.  గణనాథుడు ఎలా ఉంటాడో అలా తయారు చేసిన వినాయకుడుని ప్రతిష్టించి, భక్తిశ్రద్దలతో పూజించి మన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడండీ.  పండుగలు, ఉత్సవాలు సమాజహితాన్ని కోరాలి.  గణేష్ నవరాత్రులు  పూర్తిగా భక్తీ ప్రధానంగా, సమాజహితంగా నిర్వహించబడాలి.  మట్టి విగ్రహాలను ప్రతిష్టించి, శబ్ధ కాలుష్యాన్ని నివారించి, పర్యావరణానికి హాని కలుగకుండా చూడాల్సిన బాధ్యత మనపైన ఉందని మరచిపోకూడదు.