ఈటీవీ లో వచ్చే 'జబర్దస్త్ కామెడీ షో' హాట్ ... హాట్ యాంకర్స్ ని అందిస్తోంది. మొదట అనసూయతో ప్రారంభమైన 'జబర్దస్త్ కామెడీ షో'లో ఆమె హావభావాలు,ఆమె ధరించే దుస్తులు టీవీ ప్రేక్షకులను కట్టిపడేశాయి. దాంతో ఈ షో ఒక రేంజ్ కి వెళ్ళిపోయింది. అనసూయను చూసి మన యాంకర్స్ డీలా పడిపోయారు. ఇప్పుడు అనసూయ ఛానల్ మారడంతో 'జబర్దస్త్ కామెడీ షో' కి రేష్మీ అనే మెరుపు తీగ యాంకర్ గా దూసుకువచ్చింది. అనసూయను మరిపించేలా దుస్తులతో, తన హావభావాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ... అనసూయకు గట్టిపోటీ ఇస్తోంది. కొసమెరుపు ఏమిటంటే 'జబర్దస్త్ కామెడీ షో' చూస్తుంటే ఇది ఈటీవీ యేనా అనే అనుమానం రాక మానదు. ఎందుకంటే ఈటీవీ లో ఇంతకు ముందు ఇలాంటి అభ్యంతకర, అశ్లీలకర సన్నివేశాల కార్యక్రమాలు రాలేదు. 'జబర్దస్త్ కామెడీ షో'లో కామెడీ శృతిమించి పోయింది. కామెడీ అంటే హాయిగా కుటుంబసమేతంగా నవ్వుకోవాలి. కుళ్లు జోకులు, డబుల్ మీనింగ్ సంభాషణలతో రోత పుట్టిస్తున్నారు. వినోదం అంటే ఇదేనా?