అవినీతికి పాల్పడుతూ....మోసాలు, నేరాలు చేసి నదిలో మునకేస్తే చేసిన పాపాలు
తొలగిపోతానుకోవడం ఒట్టి భ్రమ. సమాజంలో ఎవ్వరికి ఏ హాని తలపెట్టకుండా మనసును పవిత్రంగా
ఉంచుకుని పుష్కర స్నానం చేస్తే, ఫలితం తప్పకుండా దక్కుతుంది. పుష్కర
స్నానాలు ఆచరించేవారు మనసును పవిత్రంగా
ఉంచుకుని, జలాన్ని కలుషితం చేయకుండా మూడు మునకలేసి నదికి నమస్కరించి బయటకి రావాలి. మనసును నిర్మలంగా ఉంచుకొని, ఈర్ష్య
అసూయలకు తావు ఇవ్వకుండా పుష్కర స్నానం చేస్తే ప్రయోజనం ఉంటుంది.... పుణ్యం లభిస్తుంది. శరీరాన్ని శుభ్రం
చేసుకుని, మనసులోని మలినాన్ని కడిగేసుకోకపోతే ఎన్ని పుష్కర స్నానాలు చేసినా
నిష్పలం అవుతుంది.