”శోధిని”

Tuesday 9 July 2013

ప్రభుత్వ వాహనాలకు నియమాలు వర్తించవా?


రోడ్డు భద్రత  దృష్ట్యా ఏ వాహనంలో అయినా పరిమితికి మించి బరువును తీసుకెళ్లడం చేయకూడదు.  ఇది మంచి నిర్ణయమే. కాని, ఈ నిర్ణయాలన్నీ కేవలం ప్రైవేట్ వాహనలకే వర్తించడం, ప్రభుత్వ సంస్థల ఆధ్వర్యంలో నడిచే వాహనాలకు, వ్యకులకు వర్తించక పోవడం ఆశ్చర్యకరమైన విషయం.  ఆర్టీసి బస్సుల్లో సీట్లకు మించి ప్రయానికులను రెట్టింపు సంఖ్యలో తీసుకు వెళుతున్నారు.  ప్రభుత్వ డ్రైవర్స్ ఇష్టమొచ్చినట్లు వాహనాలను నడుపుతున్నారు.  బస్సులను బస్టాపులలో అసలు ఆపరు.  ఒకవేళ బస్సు ఆగినా స్లో చేస్తారు తప్ప, బస్సును పూర్తిగా ఆపరు. ఇలా చేయడం  వల్ల  ఎంతో  మంది బస్సు వెనుక టైరు కింద పడి మరణించిన సంఘటనలున్నాయి. ఏదయినా  మొదట మనం పాటించి, ఆ తర్వాత ఎదుటి వారికి చెబితే బాగుంటుంది.