ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు అలమటిస్తుంటే , గోరు చుట్టుమీద రోకలి పోటులా కేంద్ర ప్రభుత్వం మళ్లీ పెట్రో ధరలు విపరీతంగా పెంచి ప్రజలపై మరింత భారాన్ని మోపారు. దేశంలో మండుతున్న ఎండలకు పెట్రో మంటలు తోడవడంతో పేద, మధ్య తరగతి ప్రజలకు గుండె దడ పుట్టిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా, ఏ ప్రభుత్వం పెంచలేనంత పెట్రో ధరలు పెంచి యు.పి.ఏ ప్రభుత్వం రికార్డు స్థాపించింది . భారీగా పెరిగిన పెట్రో ధరల పెంపువల్ల తాజాగా నిత్యావసర వస్తువులతో పాటు బస్సు, ఆటో చార్జీలు పెరగనున్నాయి. ఫలితంగా ప్రజలపై పెనుభారం పడే అవకాశం వుంది. పెంచిన ధర ప్రకారం హైదరాబాద్ లో రేపటినుంచి లీటరు పెట్రోలు ధర Rs.81/- రూపాయలు.` కేంద్ర ప్రభుత్వం ప్రజల బాధలను గుర్తించి, పెట్రో ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలి.