”శోధిని”

Thursday 31 May 2012

దాహం...దాహం...!




       రాష్ట్రంలోమండుతున్న ఎండలకు తోడు తాగడానికి మంచి నీరు దొరక్క ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు.  డబ్బున్నవారు నీటిని కొనుక్కొని తాగితే, పేదప్రజలు మాత్రం ప్రభుత్వం వైపు ఆశగా చూస్తున్నారు.  డిమాండుకు అనుగుణంగా ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేయలేక పోతున్నారు.  సిబ్బంది, ట్యాంకర్ డ్రైవర్స్ కుమ్మకై నీటిని దారి మల్లిస్తూ, అవినీతికి పాల్పడుతుండటంతో ప్రజల గొంతులు తాడారిపోతున్నాయి.  పట్టణాలలోనే కాకుండా గ్రామాలలోనూ ఎదే పరిస్థితి. ప్రభుత్వం పైన నమ్మకం లేక చాలా మంది తినడానికి తిండి లేకపోయినా తాగేందుకు మినరల్ వాటర్ క్యాన్లను ఆశ్రయిస్తున్నారు.  కనీసం తాగేందుకు మంచినీటిని కూడా ఇవ్వలేని ధీన స్థితిలో ప్రభుత్వం ఉన్నదంటే పరిస్థితి ఎంత ధారుణంగా వుందో అర్థమవుతోంది.  ఒకప్రక్క నీటి వ్యాపారులు  యథేచ్ఛగా భూగర్భ జలాలను తోడేస్తుంటే భూగర్భం తడారిపోయింది.  మరోప్రక్క బోర్లు ఎండిపోయి చుక్క నీరు రావడంలేదు.  నాయకులందరూ ఉపఎన్నికల పైన దృష్టి పెట్టడంతో ప్రజల నీటి కష్టాలను తీర్చే వారు కరువయ్యారు.  ప్రభుత్వం వున్నా లేనట్టుగా కనిపిస్తోంది. ఇక వానదేవుడే  ప్రజలపైన కరుణ చూపాలి.