రాష్ట్రంలో ప్రముఖ పుణ్య స్థలాలను దర్శించుకోవడానికి ప్రతి రోజు వేలాది మంది భక్తులు వెళుతుంటారు. అయితే అక్కడ గర్భగుడిలో ప్రశాంతంగా ఒక్క క్షణం నిలబడి దేవుణ్ణి కనులారా చూసే భాగ్యం కలగడం లేదు. ముఖ్యంగా తిరుమలలొ పెద్ద పెద్ద వి ఇ పి లకే శ్రీ వేంకటేశ్వరుని దర్శన భాగ్యం కలుగుతుందనే అపోహ లేకపోలేదు. భక్తుల సౌకర్యార్థం దేవస్థానంలో ఎన్నో సౌకర్యాలు కలుగజేస్తున్నారు. కాని, గర్భగుడిలోకి వచ్చేసరికి ఒక్క సారిగా యుద్ద వాతావరణం నెలకొంటోంది. దాంతో ప్రశాంతంగా స్వామిని చేసే అవకాశం భక్తులు కోల్పోతున్నారు. ఇంటి దగ్గర నుంచి ఎంతో వ్యయ ప్రయాసాలతో బయలుదేరితే, అక్కడ దేవాలయ సిబ్బంది తీరు వల్ల భక్తులకు చేదు అనుభవం ఎదురవుతోంది. దయచేసి ఆలయ అధికారులు కాస్త ఆలోచించి ప్రత్యేక దర్శనాలను తగ్గించి, ఒక్క క్షణమైనా స్వామిని దర్శించుకునే అవకాశం భక్తులకు కల్పిస్తే బాగుంటుంది.