”శోధిని”

Thursday 24 December 2020

క్రిస్మస్ శుభాకాంక్షలు !

మన మనసును పరిశుద్ధంగా వుంచుకున్నప్పుడే దేవుడు మనలో ప్రవేశిస్తాడు. దాంతో సంపూర్ణమైన ఆయన ఆశీర్వాదం, ఆశీస్సులు మనకు లభిస్తాయి.  ఇతరుల సంతోషం కోసం, వారి సుఖసౌఖ్యాల కోసం ప్రార్థన చేయమని,  సాటి మనిషిని మనస్పూర్తిగా ప్రేమించమని ఏసుక్రీస్తు చెప్పాడుఒక మామూలు మనిషిగా సాటి మనిషిని ప్రేమించమని ఆయన చెప్పాడు. అందుకే ఆయన భోధనలు ప్రపంచాన్నంతా ప్రభావితం చేశాయి.         

మిత్రులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు !

Saturday 24 October 2020

'బతుకమ్మ పండుగ' శుభాకాంక్షలు!

దేవిశరన్నవరాత్రులలో ప్రకృతిని ఆరాధించే పెద్దపండుగ బతుకమ్మ పండుగ. అసమానతలను ఎదురిద్దాం...ఆత్మగౌరవంతో బతుకుదాం అంటూ ఆడపడుచులు ఉత్సాహంగా , ఆనందంగా ఎంతో సంబరంగా ఈ పండుగను జరుపుకుంటారు. ముత్తయిదువులంతా గౌరీదేవి దీవెనలను కోరుతూ... తమ మాంగల్య సౌభాగ్యం చల్లగా ఉండాలని ప్రార్థిస్తే, యువతులు తమకు మంచి భర్త లభించి, దాంపత్య జీవనం సుఖసంతోషాలతో సాగాలని వేడుకుంటారు. కుల, మతాలకతీతంగా వాడవాడలో జరుపుకునే బతుకమ్మ పండుగ ముఖ్య ఉద్దేశం ప్రకృతిని, మహిళలను గౌరవించాలని.


Monday 10 August 2020

శ్రావణమాసం పవిత్రత

 

సృష్టి,  స్థితి లయకారిణి అయిన  అమ్మవారు అనంత శక్తి స్వరూపిని.  ఈ ప్రపంచమంతా సర్వం తానై  ఇమిడి ఉంది.  పవిత్రమైన శ్రావణ మాసంలో మంగళ, శుక్రవారాలలో అమ్మవారిని నిండు మనసుతో  పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.

 

 

Tuesday 21 July 2020

మంగళప్రదం శ్రావణమాసం !

శ్రావణ మాసంలో మంగళ, శుక్రవారాలలో అమ్మవారిని భక్తిశ్రద్దలతో నిండు మనసుతో పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. శ్రావణ మాసం మహిళలందరికీ మంగలప్రదమైనది...ఎంతో శుభదాయకమైనది. సకల శుభాలనిచ్చే శ్రీ మహాలక్ష్మి శ్రావణమాసములో వరలక్ష్మిగా పూజలందుకుంటుంది. వరలక్ష్మిదేవిని భక్తితో పూజించి, నిష్టగా, నైవేద్యాలు సమర్పించిన వారింట అమ్మవారు కొలువై ఉంటుందని భక్తుల విశ్వాసం.

Saturday 4 July 2020

గురు పౌర్ణమి శుభాకాంక్షలు!

ఉపాధ్యాయ  వృత్తి  ఏంతో  గౌరప్రదమైనది.  తల్లిదండ్రుల తర్వాత మనిషి వ్యక్తిత్వ వికాసంలో అధ్యాపకులదే   కీలక పాత్ర.   తనను తాను సంస్కరించుకుంటూ సమాజాన్ని సంస్కరించాలి కాబట్టి,   మాత్రం నిర్లక్షంగా  వ్యవహరించినా ఒక తరం తీవ్రంగా నష్టపోతుంది.  అందుకే  గురువులు భాద్యతగా  వ్యవహరించాలి.   విధినిర్వహణలో క్రమశిక్షణ, నిబద్దత ఖచ్చితంగా పాటించాలి. విద్యార్థులు ఉన్నతస్థాయికి చేరుకున్నారంటే అందులో ముఖ్యపాత్ర ఉపాధ్యాయులదే. విద్యార్థులు కుడా గురువులను గౌరవించినప్పుడే వారి ఆశయం నెరవేరుతుంది. 




Saturday 20 June 2020

అమృతం కన్నా మిన్న నాన్న మనసు


కుటుంబ సౌఖ్యం కోసం 
నిత్యం పోరాడే నిస్వార్థ యోధుడు 
తన బిడ్డల భవిష్యత్తు కోసం  
అహర్నిశలు శ్రమించే సైనికుడు 
తాను  కొవ్వొత్తియి కరిగిపోతూ 
ఇంటికి వెలుగునిచ్చే శ్రామికుడు 'నాన్న' 



ఆరోగ్యప్రదాయిని 'యోగ'


'యోగ' అనేది  సర్వజనుల శరీర ఆరోగ్యానికి సంబందించినది. మనిషి ఒత్తడిని తగ్గించి, శరీరానికి, మనసుకు అవసరమైన ప్రశాంతతను అందించే సంజీవిని. ప్రకాశవంతమైన ప్రేమకాంతిని వెదజల్లి, వ్యక్తి చుట్టూ ప్రశాంతమైన, పరిపూర్ణమైన వాతావరణాన్ని కలిగించే అమృతవాహిని. అంతేకాకుండా అసూయ, ద్వేషం, భయం, శోకం, దుఃఖం వంటి మానసిక ఆందోళనలను తగ్గించి కుళ్ళు, కుతంత్రాలను దూరం చేసే సంపూర్ణ ఆరోగ్యప్రదాయిని. శరీరాన్ని తేలిక పరచి జీవనశైలిలో మంచి మార్పును తీసుకొచ్చి, అనేక రుగ్మతలకు పరిష్కారం చూపే గొప్ప సాధనం 'యోగ'.

Wednesday 17 June 2020

"నియమాల తోరణం"


అయ్యప్ప నామస్మరణం సకల పాపహరణం !
అయ్యప్ప దర్శనం జన్మజన్మల పుణ్యఫలం!!

Sunday 24 May 2020

సకల శుభాలను అందించే రంజాన్


శుభాల సిరులు అందించే రంజాన్ పండుగ శాంతి, సమానత్వం, సామరస్యం, సోదరభావాలకు పునాది వేస్తుంది.  ప్రేమ తత్వాన్ని ప్రోది చేస్తుంది.  సమస్త శుభాలతో ఆధ్యాత్మిక సౌరభాలు గుబాళింపజేస్తుంది. అంతేకాకుండా అనాధులను, ఆర్తులను దానధర్మాలతో మతసామరస్యాన్ని చాటుతుంది.   ఆనందం విరిసిన హృదయంతో రంజాన్ పండుగను ముస్లిం సోదరులు అత్యంత వైభవంగా, ఆనందోత్సాహాలతో శోభాయమానంగా  జరుపుకోవాలని కోరుకుంటూ .. 
      అందరికీ  రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు!


                                                                                         

Thursday 30 April 2020

'మేడే' శుభాకాంక్షలు!


కార్పోరేట్ సంస్థలలో పనిచేస్తున్న ఏంతోమంది కార్మికులు  కంటినిండా నిద్రలేక,  సమయానికి తిండి లేక ఆరోగ్యాలను పాడుచేసుకుంటున్నారు.  నిరుద్యోగ సమస్యతో సతమతమవుతూ కనీస వేతనాలకు నోచుకోక  కార్పోరేట్ సంస్థల కబంధహస్తాలలో చిక్కుకొన్నారు. ఇదే అదునుగా చేసుకొని  కార్పోరేట్ సంస్థలు పని గంటలు పెంచుతూ కార్మికులను పీల్చి పిప్పి చేస్తున్నాయి.  ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతనాలు చాలా సంస్థలు ఇవ్వడం లేదు.  ప్రభుత్వాలు కార్పోరేట్ సంస్థలకు కొన్ని నిబంధనలు విధించి, అవి పాటించేలా చర్యలు తీసుకోవాలి.   శ్రమ విలువను చాటి చెప్పి శ్రమజీవుల జీవితాలలో  వెలుగులు  నింపాలి. 

                             మేడే శుభాకాంక్షలు!


Thursday 19 March 2020

సంతోషమే సగం బలం


నిత్యం ఎవరు సంతోషంగా ఉంటారో వారిలో ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది.  మనసుని  ఆహ్లాదంగా, ఆనందంగా ఉంచుకుంటూ  కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తి ని పెంచుకుంటారు.  ఎంతటి పనినైనా చేయగలననే ధీమా కలిగి ఉంటారు.  అనారోగ్య సమస్యలు వీరికి ఆమడ దూరంలో ఉంటాయి.  సంతోషంగా ఉంటే  అన్నీ  ఉన్నట్లే !

Monday 2 March 2020

తేనె కన్నా మధురం ... తెలుగుభాష కమ్మదనం!







తెలుగువారిగా పుట్టి, తెలుగుతల్లి పాలు త్రాగి,  అమ్మ నేర్పిన కమ్మనైన భాషను మరుస్తున్నారు.  తెలుగువాడినని గొప్పగా  మాతృభాషకు ద్రోహం చేస్తున్నారు.అమ్మ పాలంత స్వచ్ఛమైన, శ్రావ్యమైన తెలుగుభాషను  మాట్లాడటానికి అవమానంగా ఫీలవడం ఎందుకు?  మన పొరుగురాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడులను ఆదర్శంగా తీసుకొని స్వచ్చమైన తెలుగు భాషకు పూర్వపు వైభవం తీసుకురావడానికి  కృషి చేయాలి.  

                                                                                                                        -

Friday 31 January 2020

'రథసప్తమి' శుభాకాంక్షలు!

సమస్త ప్రాణకోటికి ప్రత్యేక్ష దైవం సూర్యభగవానుడు,  అన్ని జీవులకు  ప్రాణదాత, ఆరోగ్యప్రదాత.   సూర్యుడు ఉదయం బ్రహ్మ స్వరూపముగానూ, మధ్యాహ్నం శివుడుగాను, సాయంత్రం వేళ విష్ణువుగానూ ఉంటాడని మన పురాణాలు తెలియజేస్తున్నాయి.  ప్రతిరోజూ ప్రత్యక్ష దైవం అయిన సూర్యభగవానుడిని అర్చించిన వారికి ఆయురారోగ్యఐశ్వర్యాలు ప్రాపిస్తాయంటారు.  సృష్టిలోని  అన్ని ప్రాణులకు ప్రాణశక్తిని ప్రసాదిస్తున్న ప్రత్యక్ష దైవం సూర్యభగవాడిని మనసారా ప్రార్థిస్తాం.     

నాయకుల తీరు మారాలి


Saturday 4 January 2020

నవ్వుల జల్లుల 'ప్రతిరోజూ పండగే'


మరణాన్ని కూడా పండుగలా చేసుకోవాలన్న పాయింటుతో రూపొందించిన చిత్రం 'ప్రతి రోజూ  పండగే'.  కన్నతండ్రి ఐదు వారాల్లో చనిపోతాడని తెలిస్తే ఈ కాలం  ఎన్నారై కొడుకుల రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో అన్న పాయింటు కూడా జతచేసి కాస్త ఫన్, కాస్త ఎమోషన్ ఉండే సీన్లతో అల్లుకున్నాడు దర్శకుడు.  ఈ చిత్రానికి టైటిల్ వల్ల  మంచి క్రేజీ ఏర్పడింది.  సినిమా మొదట్లో హడాహుడి లేకుండా స్మూత్ గా సాగిపోతుంది.  చూస్తున్నంత వరకూ  'శతమానం  భవతి' సినిమా కళ్ళల్లో మెదులుతుంది.    ఇక కథలోకి వస్తే, పిల్లలు విదేశాల్లో స్థిరపడితే రఘురామయ్య  పల్లెటూరిలో ఒంటరిగా మిగిలిపోతాడు. ఆయనకి ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధపడుతుంటారు.  ఆయనకు వైద్యం అందిస్తున్న డాక్టర్ కేవలం ఐదు వారాల్లో  చనిపోతాడని చెప్పడంతో మనవడు సాయిధరంతేజ్ హుటాహుటిగా తాత  దగ్గరకు వచ్చేస్తాడు. హీరో, కుటుంబసభ్యులంతా విలేజ్ లోకి దిగిపోయాక సినిమా వేగం అందుకుంటుంది.  హీరో, హీరోయిన్ల లవ్  సీన్లు పెద్దగా లేవు.  అంతేకాదు కామెడీ సీన్లు పండినంతగా ఎమోషన్ సీన్లు పండలేదు.  రెండు పాటలు ఫర్వాలేదు.  సాయితేజ్  పాత్రకు తగ్గట్టు నటించాడు.  రఘురామయ్యగా నటించిన సత్యరాజ్ ఎమోషన్ సీన్లలో బాగానే నటించాడు.  కామెడీ సీన్లలో రావు రమేష్ కడుపుబ్బా నవ్వించాడు.  రావు రమేష్, సత్యరాజ్ ఈ సినిమాకు బాగా ఉపయోగ పడ్డారు. అన్ని వర్గాలప్రజలను అలరించడంలో దర్శకుడు మారుతి సక్సెస్ అయ్యాడు.   నేటి యువత చూడాల్సిన చిత్రం 'ప్రతిరోజూ పండగే'.