గలగల నవ్వుతూ, సిగ్గులోలికిస్తూ, తుళ్ళుతూ మాట్లాడటం టీవి యాంకర్ల లక్షణం. ఈ లక్షణాలన్నీ పుష్కలంగా వున్న కొత్త యాంకర్ అనసూయ. అందుకే ఆమెకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఆడియో ఫంక్షన్లలోనూ, టీవి ఛానల్ లోనూ అనసూయ పేరు మారుమ్రోగుతోంది. ఆమె హావభావాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఆమె ధరించే దుస్తులలోనూ ప్రత్యేక శ్రద్ద కనపరచడంతో ప్రేక్షకుల మతులను పోగొడుతూ దూసుకు పోతోంది. ఇప్పుడామెకి మంచి డిమాండ్ ఏర్పడింది. హాట్ హాట్ గా యాంకరింగ్ చేస్తున్న అనసూయ స్పీడును చూసి ఇతర యాంకర్లు బిత్తరపోతున్నారు. ఎప్పుడూ పాత ముఖాలేనా? కొత్తవారిని కుడా ప్రోత్స హిస్తామని ప్రేక్షకులు కుడా డిసైడ్ అయిపోయారు. దాంతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది అనసూయ. బెస్ట్ అఫ్ లక్ అనసూయ!