తల్లిదండ్రులు అమృత హృదయులు. వారు మనల్ని ఎంత చక్కగా సంరక్షించారో అంతకంటే ఎక్కువగా వృద్ధాప్యంలో వారిని నిర్లక్షం చేయకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. జన్మనిచ్చిన వారు ప్రత్యక్ష దైవాలు. వారిని కంటికి రెప్పలా కాపాడుకోవడం మన ధర్మం. వారు జీవించినంత కాలం కంట తడిపెట్టే పరిస్థితి కల్పించకూడదు. వారిని బాధపెట్టడం ఇంటికి అంత క్షేమం కాదు. మనకు జీవితం వారిచ్చిన భిక్షే నని మరవద్దు. వారి ఋణం తీర్చుకోవడానికి ఈ జన్మ సరిపోదు. తల్లిదండ్రులను పుజ్యునీయులుగా చూడలేని వారు దైవారాధన చేయడం శుద్ధదండగ. ఎప్పుడూ మనం అనుభవిస్తున్న సిరిసంపదలు వారి పుణ్యఫలాలేనని గుర్తుంచుకోవాలి. "వృద్ధులు వున్న ఇల్లు వృద్ధి చెందును" అన్న సూక్తిని మరవద్దు.