రాష్ట్రంలోనెలకొన్న పరిణామాలు సామాన్య ప్రజల్నిఅనేక ఇబ్బందులకు గిరిచేస్తున్నాయి. గత 57 రోజుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం పడకేసింది. ప్రజాప్రతినిధులేమో తమ పదవులను కాపాడుకుంటూ తమకేమీ పట్టనట్ట్ల్లు వ్యవహరిస్తున్నారు. సమస్య పరిష్కారం కనుక్కోవడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ఇప్పటికే నిత్యావసర ధరల తాకిడితో బాధపడుతున్న ప్రజలను తాజా పరిస్థితులు మరింత కుంగదీస్తున్నాయి. సీమాంద్ర లో స్కూళ్ళు నడవడం లేదు. బస్సులు తిరగక పోవడంతో ప్రజలు నరకయాతన పడుతున్నారు. ఇంత జరుగుతున్నా ప్రజాప్రతినిధులకు చీమ కుట్టినట్లయినా లేదు. ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలు తమ సిద్ధాంతాలను పక్కన పెట్టి కలసికట్టుగా రాష్ట్ర పరిష్కారానికి కృషి చేయండి. పార్టీల మధ్య ఐక్యత లేకపోవడంతోనే ఈ పరిస్థితి ఇంతవరకు వచ్చిందని తెలుసుకోండి. రాజకీయ పార్టీ నాయకులందరూ ఒక చోటకు చేరి ఒకరి అభిప్రాయాలను మరొకరు తెలుసుకుని రాష్ట్ర సమస్యను పరిష్కరించండి. సమస్యల సుడిగుండంలోంచి ప్రజలను బయటికి తీసుకురండి. లేకుంటే రాబోయే ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.