ఫ్లాట్లేమో పెద్దగా
దగ్గరగా ఉంటాయి
అందులో నివసించే
మనుషులేమో
చాలా దూరంగా వుంటారు
మనిషిని మనిషి
దాటేసుకు పోతున్నా...
పలకరింపులు అసలు ఉండవు
అనుబందాలు, ఆత్మీయతలు
మచ్చుకైన కనిపించవు
ఆప్యాయతలు,అనురాగాలు
మనుషుల మధ్య కరువయ్యాయి
ఎవరి పనుల్లో వాళ్ళు ...
కలివిడిలేని హడావిడి
మనక్షేమం కోరేవారే
మనబంధువులని,
ఆప్యాయత కనబరచే వారే...
మన ఆత్మబంధువులని
తెలుసుకున్న నాడే
మసకబారిని మానవ సంబంధాలు
మళ్ళీ చిగురిస్తాయి.
వెన్నెలను పండిస్తాయి.