”శోధిని”

Sunday 1 January 2023

వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు !

పుష్యమాసం శుద్ద ఏకాదశి నాడు నిద్ర నుండి మేల్కొన్న శ్రీ మహావిష్ణువు ముక్కోటి దేవతలకు  వైకుంఠంలో దర్శనమిస్తాడని చెబుతారు.    ఈ సందర్భంగా వైకుంఠంలో విష్ణువుకి ఇస్టమైన ఏకాదశి ఉత్సవాన్ని నిర్వహిస్తారు.  ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా దేవాలయాలలో  ఉత్తర దివ్యదర్శనం ఏర్పాటుచేస్తారు. వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న భక్తజనం శ్రీవారి  ఉత్తర దివ్యదర్శనంతో పులకించి భక్తి పారవశ్యంలో మినిగి పోతారు.