ఇప్పుడు కొందరు రాజకీయ నాయకుల నోట వినిపిస్తున్న కొత్త మాట 'అవినీతి పైన పోరాటం'. ఇటీవల పెద్ద పెద్ద కుంభకోణాలు అనేకం బైట పడ్డాయి. కాని, ఈ కుంభకోణాలకు పాల్పడిన వారే అవినీతి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. చిత్తసుద్ధి లేని ఇలాంటి నాయకుల కారణంగా ప్రభుత్వ శాఖలన్నిటిలోనూ అవినీతి తాండవం చేస్తోంది.ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన ఇటు నాయకులలోనూ, అటు ప్రభుత్వ సిబ్బంది లోనూ లోపించడంతో సమాజానికి 'అవినీతే' ప్రధాన శత్రువు గా మారింది. నాయకుల మనస్తత్వాలు మారనంత వరకు ఈ అవినీతి చాప క్రింద నీరులా ఉంటూనే ఉంటుంది.వీరి మాటలకు మోసపోకుండా అవినీతికి పాల్పడుతున్న వారిని నిలదీయాలి.... ప్రశ్నించాలి!