”శోధిని”

Saturday 21 November 2015

కార్తీక దీపం ... సర్వపాపహరణం!



శివునికి ఎంతో ప్రీతికరమైన మాసం ... కార్తీకమాసం!   ఈ మాసం ఆకాశదీపంతో ప్రారంభమవుతుంది.  దేవాలయాలలో ద్వజస్తంభానికి తాడు కట్టి చిన్న పాత్రలో  దీపం వెలిగించి పైకెత్తుతారు.   దీపం ద్వజస్తంభంపై వెలుగులీనుతూ ఉంటుంది.  దీపం ఆత్మ స్వరూపం. కార్తీక దీపం ... సర్వపాపహరణం!   జ్యోతి స్వరూపమైన పరమాత్మ అందరిలోనూ ప్రకాశిస్తుంటాడు.  కార్తీకమాసంలో వచ్చే  ప్రతి రోజూ శక్తివంతమైన రోజులే.   అయితే సోమవారాలకు అత్యంత ప్రధాన్యత ఉంది.  సోమవారం అంటే అభిషేక ప్రియుడికి పీతికరమైన రోజుకే కాబట్టి.   ఆరోజు చేసే అభిషేకాలకు పరమేశ్వరుడు ఎక్కువగా ఇష్టపడతాడు.  అదేవిధంగా ఈ మాసంలో వచ్చే ఏకాదశి, పున్నమి పరమ పవిత్ర దినాలు.