జన్మ నిచ్చిన తల్లిదండ్రులు సాక్షాత్తు దైవ స్వరూపులు. వారికి సర్వతా కృతజ్ఞతా భావంతో ఉండాలి. వృధ్యాప్యంలో తమ సంతానం పట్టించుకోవడం లేదని, నిర్లక్ష్యంగా చిన్న చూపు చూస్తున్నారని చాలా మంది అనాధ వృద్ధ శరణాలయాలలో కుంగి పోతుంటారు. అయితే సంస్కారవంతులు ఎవరైనా తల్లిదండ్రులను చిన్న చూపు చూడరు. సంస్కారహీనులయితేనే కన్నవారిని ఇబ్బందికి గురిచేస్తారు. త్యాగానికి ప్రతిరూపాలు అమ్మ, నాన్నలు. వృధ్యాప్యంలో వారికి అండగా నిలబడాలి. భాద్యత నుండి తప్పుకోకుండా కన్నవారిని కన్న బిడ్డల్లా చూసుకోవాలి. అందుకు వారిని నిత్యం పూజించాలి... అభిమానించాలి... ఆదరించాలి. అప్పుడే జీవితానికి అర్థం, పరమార్థం.