
నేడు మానవుని మనసులో మార్పులోచ్చి , మనవ సంబంధాల స్థానంలో ఆర్ధిక సంబంధాలు వచ్చి చేరాయి. ఈ పరిణామం వల్ల తల్లిదండ్రులను గౌరవించడం క్రమంగా తగ్గిపోయింది. ఇంట్లో నుంచి పెద్దలకు గౌర మర్యాదలు దక్కడం లేదు. కొందరు అయితే ఇంట్లో వేధింపులు తట్టుకోలేక ఉదయం నుంచి సాయంత్రం వరకు బయట గడిపి, ఏ రాత్రి వేళలో ఇంటికి చేరుకుంటున్నారు. పెద్దలంటే గౌరవం, ప్రేమ ఈనాటి పిల్లలకు లేకుండా పోతోంది. తనను పెంచి, పోషించి తను ఇంత కావడానికి కారణమైన తల్లిదండ్రులను అగౌరంగా మాట్లాడటం నిజంగా సిగ్గు చేటు. డబ్బున్న వాళ్ళు వృద్దాశ్రమంలో చేర్పిస్తే, డబ్బులేని వాళ్ళు అనాదాశ్రామంలో వదిలేసి, తమ బాధ్యత తీరిందని భావిస్తున్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులను సంపాదనలో పడి నిర్లక్షం చేస్తున్నారు. మరికొందరు సంపాదన వేటలో పడి విదేశాలకు వెళుతూ తల్లిదండ్రులను ఒంటరిగా వదిలేస్తున్నారు. మనల్ని తల్లిదండ్రులు ఎంత ప్రేమగాచూసుకున్నారో, మనం వాళ్ళను అంతే ప్రేమగా చూడకపోయినా, కనీసం వాళ్ళ మనసు బాధ పడకుండా చూసుకోవడం మన బాధ్యత. వారి అవసరాల్ని తీర్చడం, ఆప్యాయతను పంచడం మన ధర్మం.