”శోధిని”

Saturday 21 July 2012

తల్లిదండ్రులను గౌరవిద్దాం!



                నేడు  మానవుని మనసులో మార్పులోచ్చి , మనవ సంబంధాల స్థానంలో ఆర్ధిక సంబంధాలు వచ్చి చేరాయి.  ఈ పరిణామం వల్ల తల్లిదండ్రులను గౌరవించడం క్రమంగా తగ్గిపోయింది.  ఇంట్లో నుంచి పెద్దలకు గౌర మర్యాదలు దక్కడం లేదు.  కొందరు అయితే ఇంట్లో వేధింపులు తట్టుకోలేక ఉదయం నుంచి సాయంత్రం వరకు బయట గడిపి, ఏ రాత్రి వేళలో ఇంటికి చేరుకుంటున్నారు.  పెద్దలంటే గౌరవం, ప్రేమ ఈనాటి పిల్లలకు లేకుండా పోతోంది.  తనను పెంచి, పోషించి తను ఇంత కావడానికి కారణమైన తల్లిదండ్రులను అగౌరంగా  మాట్లాడటం నిజంగా సిగ్గు చేటు.  డబ్బున్న వాళ్ళు వృద్దాశ్రమంలో చేర్పిస్తే, డబ్బులేని  వాళ్ళు అనాదాశ్రామంలో వదిలేసి, తమ బాధ్యత తీరిందని భావిస్తున్నారు.  జన్మనిచ్చిన తల్లిదండ్రులను సంపాదనలో పడి నిర్లక్షం చేస్తున్నారు. మరికొందరు సంపాదన వేటలో పడి విదేశాలకు వెళుతూ తల్లిదండ్రులను ఒంటరిగా వదిలేస్తున్నారు. మనల్ని తల్లిదండ్రులు ఎంత ప్రేమగాచూసుకున్నారో, మనం వాళ్ళను అంతే ప్రేమగా చూడకపోయినా, కనీసం వాళ్ళ మనసు బాధ పడకుండా చూసుకోవడం మన బాధ్యత.  వారి అవసరాల్ని తీర్చడం, ఆప్యాయతను పంచడం మన ధర్మం.

12 comments:

జలతారు వెన్నెల said...

భవిష్యత్తు లో ఈ తల్లితండ్రులని గౌరవించని,కనీస బాధ్యతలను కూడా నిర్వర్తించని వారిని వీళ్ళ పుత్ర/పుత్రికా రత్నాలు కూడా ఇలాగే చూస్తే అప్పుడు కాని, వీళకు బుధ్ధి రాదు లేండి. మంచి టపా నాగేంద్ర గారు.

శ్రీ said...

వృద్దులైనవారిని ఇంట్లో ఉంచకుండా వృద్ధాశ్రమాల్లో
ఉంచే కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి.
పిల్లలను పెంచడంలో వాళ్ళకున్న సరదాలను చంపుకున్న
తల్లిదండ్రులను.. పిల్లలు పెద్దయ్యాక వాళ్ళ సరదాలని త్యాగం చేయడానికి
బదులు తల్లిదండ్రులను త్యాగం చేస్తున్నారు...
నిజంగా దురదృష్టం...
పిల్లల ఆలోచనల్లో మార్పు వస్తుందని ఆశిద్దాం...
మంచి టాపిక్ వ్రాసారు నాగేంద్ర గారూ!
అభినందనలు...@శ్రీ

Meraj Fathima said...

నాగేంద్ర గారూ, అది పిల్లల తప్పు కాదు పిల్లలకి నైతికవిలువలను నేర్పే చదువులు లేవు, పెద్దలయెడ ఎలా మెలగాలి అనే కథలు తెలీదు, మనమే వాటిని తుడిపేసాము, ఈ తరం మాత్రమె అలా ఎందుకుంటుంది,దీని వెనుక చాలా కారణాలు ఉన్నాయి. వీలుంటే అన్ని కోణాలనుండి అలోచించి చూడండి. అయితే అలా ప్రవర్తించటం కరక్ట్ అంతం లేదు, అలా కాకూడదు అంటే స్వార్ధం పోవాలి దాని స్తానంలో భాద్యత తెలియ జేయాలి.

రాజ్యలక్ష్మి.N said...

"కనీసం వాళ్ళ మనసు బాధ పడకుండా చూసుకోవడం మన బాధ్యత."
మంచి విషయం చెప్పారండీ...

Anonymous said...

తమ బిడ్డలు అవిటివాళ్ళయినా, పిచ్చివాళ్ళయినా తల్లిదండ్రులు వాళ్ళని ప్రేమతో పెంచగలిగినప్పుడు ముసలితనంలో తల్లిదండ్రులను పిల్లలు ఎందుకు ఆదరించలేరు?

వనజ తాతినేని/VanajaTatineni said...

మీరు చెప్పింది నిజమేనండీ! వృద్దాప్యం శాపం అవుతుంది.
మా పిల్లలు మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు అని చెప్పే రోజు ఇంటింటికి ఉండాలని కోరుకుందాం.

కాయల నాగేంద్ర said...

మీ స్పందనకు ధన్యవాదాలండీ!

కాయల నాగేంద్ర said...

మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలండీ!

కాయల నాగేంద్ర said...

మీ స్పందనకు థాంక్స్ రాజి గారు!

కాయల నాగేంద్ర said...

పోస్ట్ నచ్చినందుకు ధన్యవాదాలండీ!

కాయల నాగేంద్ర said...

థాంక్స్!

కాయల నాగేంద్ర said...

మీ స్పందనకు ధన్యవాదాలు వనజ గారు!