అందచందాలతో...
పనిలేకుండా
కులమతాలతో...
సంబంధం లేకుండా
మల్లెపువ్వులాంటి
స్వచ్చమైన మనసుతో
చేసే బంధం పవిత్రబంధం!
ఆ ప్రేమ బంధంలో ...
చల్లనిచూపులు...
మధురమైన పలుకులు...
ఆప్యాయతానురాగాలు...
చిరుదరహాసాలు...ఉంటే చాలు
ఆ ప్రేమ శాశ్వతంగా నిలుస్తుంది
అలాంటి ప్రేమను పొందినవారి...
మనసు ఎప్పుడూ పరిమళిస్తూ ఉంటుంది.