ఈ మధ్య వస్తున్న టీవీ సీరియల్స్ చూస్తుంటే...అసలు మనుషుల మధ్య సత్సంబంధాలు, కుటుంబసభ్యుల మధ్య అభిమానాలు ఉండావా ? ప్రపంచమంతా మెచ్చుకునే మన కుటుంబ వ్యవస్థ విలువలేమయ్యాయి ? అనే సందేహం కలగకమానదు. ఎందుకంటే మన తెలుగు టీవీ సీరియల్స్ లో మగాడికి రెండు పెళ్లిళ్లు, వివాహేతర సంబంధాలు, అత్తాకోడళ్ళు, తోడికోడళ్ళ మధ్య పోరు, పగలు, ప్రతీకారాలు. డానికి తోడు కుట్రలు కుతంత్రాలు...మంత్రం తంత్రాలు.
చిన్న పిల్లల చేత పిచ్చి డ్యాన్స్ లు, అసభ్యకరమైన దుస్తులు వేయించడం. హాస్య కార్యక్రమం పేరుతొ మగవాళ్ళు ఆడవేషాలు వేస్తూ, ద్వంద అర్థాలతో కూడిన డైలాగులతో హాస్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఒకరునొకరు కొట్టుకోవడం, జడ్జీలు విరగపడి నవ్వడం... ఇవ్వన్నీ చూస్తుంటే మనకు పిచ్చి ఎక్కడం ఖాయం.