”శోధిని”

Thursday 5 January 2012

'శ్రీరామరాజ్యం’ చిత్రాన్ని యువత చూడాలి


ఆంధ్రభూమి  వెన్నెల



మీవ్యూస్


కళాప్రపూర్ణ, చిత్రబ్రహ్మ బాపు దర్శకత్వంలో ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘శ్రీరామరాజ్యం’. ఈ సినిమా పండితుల, పామరుల ప్రశంసలు అందుకుంటోంది. నేటి తరం, రేపటి తరం వారు కూడా ఎప్పటికీ గుర్తుంచుకునేలా బాపుఅత్యంత సుందరంగా ఈ చిత్రాన్ని తెర కెక్కించారు. సీతారాముల మధ్య ఉండే ప్రేమానురాగాలు చిత్రీకరించిన తీరు చాలా బాగుంది. ప్రతి సన్నివేశంలో బాపుగారు కనిపిస్తే, ప్రతి మాటలోనూ శ్రీరమణగారు గుర్తుకువస్తారు. అదే విధంగా ఆర్ట్ డైరెక్టర్ పనితనం ప్రతి సెట్‌లోనూ కనబడుతుంది. అలాగే ఇళయరాజా సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. పాటలన్నీ వినసొంపుగా, సన్నివేశాలకు తగ్గట్టుగా ఆకట్టుకున్నాయి. బాలకృష్ణ తన తండ్రిని ఆదర్శంగా తీసుకుని శ్రీరాముడి పాత్రను చక్కగా పోషించాడు. సీత పాత్రలో నయనతార వొదిగిపోయి నటించారు అనడం కంటే జీవించారు అని చెప్పవచ్చు.

- కాయల నాగేంద్ర, హైదరాబాద్