ఉగాది తెలుగువారి సంవత్సరాది. జీవితాల్లో ఉషస్సులు నింపే పండుగ . కాని,నేటి యువత జనవరి 1న ఆంగ్ల సంవత్సరానికి అలవాటు పడటంతో ఎంతో విశిష్టత వున్న ఉగాదిని మొక్కుబడిగా జరుపుకొవడం ఆనవాయితీగా మారిపోయింది. ఫలితంగా మన భాష, సంస్కృతి , సంప్రదాయాలు క్రమేణా కనుమరుగున పడుతున్నాయి. ఇప్పటికైన మన ఉగాది పండుగ గొప్పదనాన్ని పిల్లలకు వవరించి మన సంస్కృతిని కాపాడుకుందాం.
చైత్ర మాసంలో ప్రకృతి ఎంతో శోభాయమానంగా ఉంటుంది. చెట్ల ఆకులు రాల్చి, కొత్త చిగుళ్ళతో ఆకుపచ్చదనం కళ్ళకు సుఖాన్ని, ఆనందాన్ని కలుగచేస్తుంది. వసంత ఋతువు చైత్ర మాసంలోనే ఆరంభమవుతుంది. ఈ రుతువులోనే కోయిల లేత మామిడి చిగుళ్ళను తింటూ, మధురంగా గానం చేస్తుంది. ప్రకృతిని చూసి సకల ప్రాణులు పరవశం చెందేది ఈ రుతువులోనే. అందుకే ఈ ఋతువుకు రుతురాజు అనే పేరు సార్థకమైంది.
వసంత ఋతువులో ప్రకృతి సర్వాంకార శోభితమై కనువిందు చేస్తుంది. వసంత ఋతువులో చైత్రంమాస, శుక్లపక్ష పాడ్యమినాడు ఉగాది పండుగ. ఋతువులలో వసంతం మొదటిది. తెలుగు నెలల్లో చైత్రం మొదటిది. అలాగే పక్షాలల్లో శుక్లపక్షం, తిధులల్లొ పాడ్యమి ఇలా ఋతువు, మాసం, పక్షం, తిధి అన్నీ ప్రధమమైనవి నందున ఈ రోజున వచ్చే ఉగాదికి అంత ప్రాధాన్యత వుంది. ఈ రోజునే బ్రహ్మదేవుడు పూర్వం సృష్టిని ప్రారంభించినట్టు మన పురాణాలు చెబుతున్నాయి.
తెలుగువారి సొంతమైన షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి. దీన్ని సేవించడం వలన ఎంతో ఆరోగ్యం సమకూరుతుంది. ఇందులో వాడే వేపపువ్వులో క్రిమిసంహారక గుణం ఉంది. మామిడి ముక్కలు రక్తప్రసరణ దోషాలను నివారిస్తాయి. చింతపండు వాతాన్ని హరిస్తుంది. బెల్లం రక్తహీనతను పోగొడుతుంది. పచ్చిమిరపకాయకు వాతాన్ని పోగొట్టే గుణం ఉంది . ఉప్పు అజీర్ణాన్ని పోగొడుతుంది. ఇన్ని సుగుణాలున్న ఉగాది పచ్చడి పరమౌషదం.
ఉగాది రోజున ఆనందంగా ఉంటే సంవత్సరమంతా శాంతి సౌఖ్యాలతో జీవితం గడిచిపోతుందని చాలా మంది నమ్ముతారు. గొప్పవారైనా , పేద వారైనా తమ తమ శక్తి తగ్గట్టుగా ఉగాది రోజున ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండటానికి ప్రయత్నించాలి. పచ్చని తోరణాలతో గుమ్మాలను అలంకరించి వసంత లక్ష్మిని ఇంటికి ఆహ్వానిస్తాం. ఆప్యాయతలు, అనుబంధాలు , అనురాగాలు, ఆత్మీయతల మధ్య ఆనందో త్సాలతో ఉగాది పండుగను జరుపుకుంటాం .
ఈ విజయనామ సంవత్సరం అందరికీ విజయం చేకూరాలని, సర్వశుభాలు కలగాలని ఆశిస్తూ... అందరికీ ఉగాది (నూతన సంవత్సరం) శుభాకాంక్షలు!
సర్వేజనా సుఖినోభవంతు !

---