”శోధిని”

Monday 4 June 2012

పర్యావరణాన్ని కాపాడుదాం ... ప్రాణకోటిని రక్షిద్దాం!



నేడు టెక్నాలజీ పేరుతో విలాసవంతమైన  జీవితం గడపడానికి అలవాటుపడి, ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్నాం.  పరిశ్రమలు వదిలే వ్యర్ధ పదార్థాల వల్ల జలకాలుస్యం, వాహనాల వదిలే పొగ  వల్ల వాయుకాలుస్యం పెరిగిపోతోంది.  ప్లాస్టిక్ పర్యావరణానికి ముప్పు అని తెలిసినా విచ్చలవిడిగా ప్లాస్టిక్ వస్తువులను వాడుతున్నారు. దాంతో ప్లాస్టిక్ వ్యర్ధాలు భూమి పైపొరల్లో పేరుకుపోయి అనేక సమస్యలకు కారణమవుతున్నాయి.  అధిక దిగుబడులకోసం పంటపొలాలపై రసాయనక ఎరువులు,పురుగు మందులు వాడుతున్నారు.  కలప కోసం అడవుల్ని నరికి ముగజీవులకు నీడ లేకుండా చేస్తున్నారు. పచ్చదనం మీదే ప్రపంచ మనుగడ ఆధారపడివుందన్న విషయం మరువకూడదు. మనిషికొక చెట్టు నాటి, బిడ్డలా పెంచితే దేశంలో కోట్ల వృక్షాలు పుట్టుకొస్తాయి.  పచ్చని చెట్లు కాలనీల నిండా  నాటితే భూమాత చల్లగా వుంటుంది.  దాంతో వర్షాలు పుష్కలంగా కురుస్తాయి.  సర్వ జీవకోటికి ప్రాణాధారమైన చెట్లను నరకడం మాని మొక్కలను నాటడం అలవాటు చేసుకోవాలి.  పర్యావరణానికి ముప్పువాటిల్లితే అకాల వర్షాలు, పండిన పంటలను మింగేస్తాయి.  మండే ఎండలు మనల్ని మాడ్చేస్తాయి.  కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొచ్చి ప్రజల ప్రాణాలు తీస్తాయి. పర్యావరణాన్ని  పరిరక్షించాలంటే, కొండలను కొండలుగా ఉంచాలి.  నదులను నదులుగా పారనివ్వాలి.  చెట్లను చెట్లగానే బ్రతకనివ్వాలి.  స్వచ్చమైన నీరు, స్వచ్చమైన గాలి లభించిననాడే కాలుష్య రహిత సమాజం ఏర్పడుతుంది.  తద్వారా పర్యావరణ పరిరక్షణ సాధ్యపడుతుంది.

నాయకుడు



 వాడికి ఓటు వేసిన ప్రతిసారీ...
మనమే ఓడిపోతుంటాం
వాడేమో పైకి వెళ్లి 
మనకు చుక్కలు చూపిస్తాడు 
ఓటు కోసం మనల్ని అడుక్కుంటాడు 
వాడు మంత్రి అయ్యాక 
మనం అడుక్కోవాలి వాడ్ని
ఎన్నకలోస్తే కందిరీగలా...
మనచుట్టూ తిరుగుతాడు 
ఎన్నికలయ్యాక తునీగలా...
వాడి చుట్టూ మనం తిరగాలి 
ఎన్నికల ముందు కురిపిస్తాడు వరాలు 
తర్వాత మనకు పట్టిస్తాడు చెమటలు 
ప్రజా సమస్యల్ని వాగ్ధానాలుగా మార్చి 
పదవికోసం ఎటయినా దూకుతాడు 
ఊసరివెల్లిలా రంగు దుస్తులు మార్చుతూ... 
అవకాశం కోసం గోడమీది పిల్లిలా ...
నిత్యం ఎదురు చూస్తుంటాడు
పెద్ద ఆఫర్ రాగానే గోడ దూకేస్తాడు 
ఇలాంటి వాళ్ళని కంట కనిపెట్టాలి 
ఎన్నికలలో తగిన గుణపాఠం చెప్పాలి.