దైవత్వం మానవత్వంలోకి ప్రవేసించిన రోజు క్రిస్మస్. అందుకే ఈరోజు భక్తి
శ్రద్దలతో పవిత్రంగా పండుగ చేసుకుంటారు. ఒక మామూలు మనిషిగా సాటి మనిషిని ప్రేమించమని ఏసుక్రీస్తు చెప్పాడు. ఆయన
భోధనలు ప్రపంచాన్నంతా ప్రభావితం చేశాయి. ఈలోకంలోకి లోకరక్షకుడిగా
వచ్చినందుకు ఏసుక్రీస్తును హృదయంలోకి చేర్చుకుని ఆరాదిస్తారు. క్రిస్మస్ నాడు దేవుని వాక్యానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. క్రీస్తుని ఆరాధించడానికి తాపత్రయపడాలి. " నీపట్ల నీవు ఎలా ప్రవర్తించుకుంటారో
ఇతరుల పట్ల అలాగే వ్యవహరించు... పోరుగువారిని నీలాగా భావించి ప్రేమించు..."
ఇలాంటి వాక్యాలు కోకొల్లలు. మిత్రులందరికీ 'క్రిస్మన్' పర్వదిన శుభాకాంక్షలు.