గోరంత పూజకి కొండంత ప్రతిఫలం!
తెలుగు మాసాలలో కార్తీక  మాసం ఎంతో పవిత్రమైనది.  ఈ మాసంలో
శివునికి చేసే పూజకి కొండంత ఫలం లభిస్తుంది భక్తుల నమ్మకం. కార్తీక  మాసంలో  శివుడికి అభిషేకములు,
మారేడుదళాలు  సమర్పించినా 
శివ కటాక్షం లభిస్తుందంటారు. ఈ మాసంలో కార్తీక  స్నానం,
తులసి పూజ,
శివకేశవుల స్తోత్ర
పారాయణం, పూర్ణిమ,
ఏకాదశులలో చేసే
శ్రీ సత్యనారాయణ వ్రతం అత్యంత శుభఫలాలు ఇస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

