”శోధిని”

Monday 9 December 2013

పప్పులో కాలేసినట్లే!

 
'మన ఇల్లు పచ్చగా వుంటే చాలు.   మన చుట్టూవున్న వారితో, పరిసరాలతో మనకు పని లేదు'  అనుకునే వాళ్ళు చాలా మంది వున్నారు.  వీళ్ళు చదువుకోలేని అజ్ఞానులు అంటే అదీ కాదు. బాగా చదువుకున్నవాళ్ళే అధికం. మన ఇల్లు, గేటు వరకే మనదని, దాని తర్వాత ప్రాంతం మనవి కాదని మన ఇంట్లో చెత్త చెదారాన్ని అక్కడ పడేస్తే, క్రిమికీటకాలు చేరి మన ప్రక్కవాళ్ళతో పాటు మనల్ని కుట్టి రోగాలను పుట్టిస్తాయని తెలుసుకోలేని మార్ఖులు.   అంతేకాదు  అది చూసేవాళ్ళకి ఎంత అసహ్యంగా కనిపిస్తుందో ఆలోచించారు. మనం తిరిగే ప్రతీ ప్రాంతం మనదే అనుకుని పరిశుభ్రంగా వుంచడానికి ప్రయత్నించాలి. ఇవ్వన్నీ చేయాలంటే ముందు మన మనసులో ఎలాంటి మలినాలు లేకుండా పరిశుభ్రంగా వుంచుకోవాలి. అప్పుడే మన చుట్టూ వున్న పరిసరాల గురించి ఆలోచిస్తాం. మన చుట్టూ వున్నా పరిసరాలు కుడా మనవే అనే అభిప్రాయం అందరిలో కలగాలి. పరసరాలను కలుషితం చేస్తే ఈగలు, దోమలు, బొద్దింకలు చేరి మన ఇంట్లేకి రాక మానవు. మన పుణ్యమా అని ఇరుగు పొరుగు వాల్లకి చేరక మానవు. మన ఇల్లే శుభ్రంగా వుంచుకుని, మిగిలినది మనకి సంబంధం లేదు అనుకుంటే పప్పులో కాలేసినట్లే!