సృష్టిలో ఎ ఇతర జీవికి ఎవ్వని వరం భగవంతుడు మనిషికి మాట్లాడే అవకాశం కల్పించాడు. దేవుడు నోరు ఇచ్చాడని ఇష్టం వచ్చినట్లు మాట్లాడకూడదు. ప్రతి మనిషి తోటివారికి సాయం అందిస్తూ, జీవితంలో మంచిగా ఉంటూ నిజాయితీగా, ప్రశాంతంగా జీవించాలి. మాట్లాడటం పద్దతిగా ఉంటూ ఇతరులకు ఆదర్శంగా నిలవాలి. అతిగా మాట్లాడేవారిని లోకం పట్టించుకోదు. అవసరమైనంత వరకే మాట్లాడితే ఆ మాటకు, ఆ వ్యక్తికి విలువ ఉంటుంది. అందుకే తెలివైనవాళ్ళు మితంగా మాట్లాడతారు. అనవసరంగా మాట్లాడేవాళ్ళను ఎవరూ పట్టించుకోరు. మన మాటలు ఇతరులకు బాధ కలిగించకూడదు. ఇతరులను వేధించే విధంగా ఉండకూడదు. అందుకే మనం మాట్లాడే ప్రతి పదాన్ని బాగా ఆలోచించి ఉపయోగిస్తే బాగుంటుంది.