Sunday, 31 May 2015
Saturday, 30 May 2015
మానవసేవే మాధవసేవ !
శ్రీవారి భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం వారు చేపట్టిన గొప్ప సేవ అన్నదానం కార్యక్రమం. నిత్యం ముప్పయివేల మందికి పైగా భక్తులు అన్నదానం కాంప్లెక్స్ లో భోజనం చేసి స్వామివారి మహాప్రసాదం తిన్నంత ఆనందపడిపోతారు. పేద భక్తులకు ఈ సదుపాయం నిజంగా ఒక వరమే ! రోజూ ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు ఇక్కడ ఉచిత భోజనాలు పెడుతూనే ఉంటారు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అయన చేతుల మీదుగా ప్రారంభమైన గొప్ప పుణ్య సేవా కార్యక్రమం అన్నదానం.
Wednesday, 27 May 2015
యుగపురుషుడు !
కృషి, పట్టుదల, క్రమశిక్షణ, మంచి నడవడికతో... అంకితభావంతో తెలుగు చలనచిత్ర రంగంలో మహోన్నత స్థాయికి చేరుకొని తెలుగు ప్రజల మన్నలను పొందిన గొప్ప నటుడు స్వర్గీయ నటరత్న నందమూరి తారక రామారావు గారు. మాటలో మంచితనం, భావనలో వివేకం, సాధనలో పట్టుదల, నటనలో విలీనం రామారావు గారికున్న ముఖ్య లక్షణాలు. సంపూర్ణమైన వ్యకిత్వానికి ఆయన చక్కని నిదర్శనం.
తెలుగు చలన చిత్రరంగంలో ఎన్నెన్నో వైవిధ్యభరితమైన పాత్రలు పోషించి, తనకు సాటిరారని నిరూపించిన ఎన్టీఆర్ సినీ అభిమానుల హృదయాలలో శ్వత స్థానంసంపాదించుకున్నారు...తెలుగు సినీరంగంలో అగ్రస్థానం అధిష్టించారు. ఏ పాత్ర పోషించనా ఆ పాత్రకు ప్రాణం పోసేవారు. చారిత్రాత్మకం, జానపదం, పౌరాణికం, సాంఘీకం ఇలా ఆయని చేయని పాత్రంటూ లేవు. ప్రతి పాత్రలో లీనమై తెలుగువారి హృదయాలలో జీవించి ఉన్నారు . తెలుగువాడి బింకం, తెలుగువారి మమకారం, తెలుగువాడి మాటతీరు, పద్దతి అంతా ఆయన దివ్యమైన రూపంలో కనిపిస్తుంది. వ్యక్తిగా ఆయన సమున్నతుడు... వ్యక్తిత్వంలో మహోన్నతుడు.
ఇక రాజకీయాల విషయానికొస్తే ...అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లో కంచుకోటగా ఉంటూ తనకు తిరుగులేని శక్తిగా ఉన్న కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించన ఘనత ఎన్టీఅర్ గారిది.ఆయన ముఖ్యమంత్రిగా ఒన్న సమయంలోపార్లమెంటులో పెద్ద పార్టీలయిన బిజెపి, సిపిఐ, సిపియంల కంటే ఎక్కువ స్థానాలు 35 పార్లమెంటు స్థానాలు గెలుచుకొని పార్లమెంటులో ఒక ప్రాంతీయ పార్టీ మొదటి సారిగా ప్రదాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ చరిత్ర సృష్టించింది. ఇది తెలుగువారందరికీ గర్వకారణం.ఎన్టీఅర్ జన్మదిన సందర్భంగా ....
Monday, 25 May 2015
ఇది స్వార్థం కాదా ?
అమ్మాయిలు నలుపు అయినా మంచి మనసు ఉంటే చాలు. తెల్లటి అమ్మాయిలలో మంచి మనసు లేకపొతే జీవితాంతం బాధ పడాల్సి ఉంటుంది. అందుకే అబ్బాయిలూ...కాబోయే భార్య రంగు ఏదైనా వెన్నలాంటి మంచి మనసును చూడండి. కేవలం రంగు చూసి మోసపోకండి. మీరు నలుపు అయినా తెల్లటి అమ్మాయి భార్య కావాలనుకోవడం స్వార్థం కాదా ? మీలాగే అమ్మాయిలు కూడా తెల్లటి అబ్బాయిలనే తన జీవిత భాగస్వామిగా కావాలనుకుంటే చాలా మంది అబ్బాయిలు పెళ్ళికాని ప్రసాదులుగా మిగిలిపోతారు. కాని, అమ్మాయిలు అలా రంగు గురించి ఆలోచించడం లేదు. హృదయం నిండా మంచితనం, మానవత్వం నింపుకుని అబ్బాయిల రంగు ఎదైనా తల వంచి తాళి కట్టించు కుంటున్నారు... అదీ వాళ్ళ గొప్పతనం!
Saturday, 23 May 2015
Friday, 22 May 2015
Thursday, 21 May 2015
Saturday, 16 May 2015
దైవ స్వరూపులు !
జన్మ నిచ్చిన తల్లిదండ్రులు సాక్షాత్తు దైవ స్వరూపులు. వారికి సర్వతా కృతజ్ఞతా భావంతో ఉండాలి. వృధ్యాప్యంలో తమ సంతానం పట్టించుకోవడం లేదని, నిర్లక్ష్యంగా చిన్న చూపు చూస్తున్నారని చాలా మంది అనాధ వృద్ధ శరణాలయాలలో కుంగి పోతుంటారు. అయితే సంస్కారవంతులు ఎవరైనా తల్లిదండ్రులను చిన్న చూపు చూడరు. సంస్కారహీనులయితేనే కన్నవారిని ఇబ్బందికి గురిచేస్తారు. త్యాగానికి ప్రతిరూపాలు అమ్మ, నాన్నలు. వృధ్యాప్యంలో వారికి అండగా నిలబడాలి. భాద్యత నుండి తప్పుకోకుండా కన్నవారిని కన్న బిడ్డల్లా చూసుకోవాలి. అందుకు వారిని నిత్యం పూజించాలి... అభిమానించాలి... ఆదరించాలి. అప్పుడే జీవితానికి అర్థం, పరమార్థం.
Wednesday, 13 May 2015
ప్రకృతిలా జీవించు !
స్వచ్చంగ, నిర్మలంగా ఎటువంటి కల్మషం లేకుండా ప్రకృతి ఎంతో హాయిగా ఉంటుంది. ప్రకృతిలోని అపురూప దృశ్యాలు కనువిందు చేస్తాయి. మనసంతా ఆహ్లాదాన్ని నింపుతాయి. ప్రకృతి ఇంత ప్రశాంతంగా ఉన్నప్పుడు అందులో భాగమైన మానవులు నిర్మలంగా ఉండలేక పోవడానికి కారణం... కుళ్ళు, కుతంత్రాలు, స్వార్థం, వంచన మోసంతోనే చాలా మంది జీవనం సాగిస్తున్నారు కాబట్టి. అందుకేనేమో మానవులు ప్రకృతి లా ఉండలేక పోతున్నారనుకుంటా.
Tuesday, 12 May 2015
తన దాక వస్తే ...(ప్రాణం పైన తీపి )
పేషెంట్ ను చూస్తుండగా డాక్టర్ గారికి గుండెపోటు వచ్చింది.
డాక్టర్ : "నర్స్ ..వెంటనే 108 కి ఫోన్ చేసి నన్ను ఆసుపత్రికి తీసుకెళ్ళు "
నర్స్ : "అదేమిటి డాక్టర్ మన ఆసుపత్రి ఉండగా ... ఇంకో ఆసుపత్రికి ఎందుకు ?"
డాక్టర్ : గుండెపోటుతో మన ఆసుపత్రి లో చేరిన వాళ్ళు ఇప్పటి వరకు బతికి బయట పడలేదు కదమ్మా" అసలు విషయం చెప్పాడు డాక్టర్.
డాక్టర్ : "నర్స్ ..వెంటనే 108 కి ఫోన్ చేసి నన్ను ఆసుపత్రికి తీసుకెళ్ళు "
నర్స్ : "అదేమిటి డాక్టర్ మన ఆసుపత్రి ఉండగా ... ఇంకో ఆసుపత్రికి ఎందుకు ?"
డాక్టర్ : గుండెపోటుతో మన ఆసుపత్రి లో చేరిన వాళ్ళు ఇప్పటి వరకు బతికి బయట పడలేదు కదమ్మా" అసలు విషయం చెప్పాడు డాక్టర్.
Saturday, 9 May 2015
మాతృ ప్రేమ మాధుర్యం !
కడుపు మండుతున్నా ...
గొంతుఎండిపోతున్నా...
బిడ్డ ఆకలి తీర్చేందుకు
తల్లడిల్లే మాతృ హృదయం
ఆమెకు బిడ్డ ఆకలి తప్ప
తన ఆకలి తెలియదు
ప్రేమను పంచడం తప్ప
ప్రేమను ఆశించదు
మాతృ ప్రేమలోని మాధుర్యం
మాటల్లో చెప్పలేనిది
ఆమె త్యాగం అమూల్యం
అందుకే ఆమె త్యాగమూర్తి
ప్రేమాభిమానాల పెన్నిధి !
మిత్రులందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు !
Friday, 8 May 2015
Thursday, 7 May 2015
// పెను ప్రళయం //
ప్రకృతి విలయతాండవం
పెను ప్రళయ ప్రకంపనం
నేపాల్ భయానక భూకంపం
గుండెలను పిండేసే పెను విషాదం
హిమఖండం కంపించింది
పంచప్రాణాలను పిండేసింది
వారసత్వ సంపదను మింగేసింది
మంచు నేలను మట్టిదిబ్బగా మార్చింది
ప్రకృతి సౌందర్యమంతా
విషాద నిలయమయింది
తలక్రిందులైన జనజీవనం
కాలం అంచుల మీద కన్నీటి దృశ్యాలు
కళ్ళెదుట ఊహించని సజీవ శిల్పాలు !
Wednesday, 6 May 2015
Monday, 4 May 2015
Sunday, 3 May 2015
అప్పు మహత్యం (జోక్)
"రక్షించండి ... రక్షించండి" అంటూ ఒకతను చెరువులో మినిగిపోతూ అరుస్తున్నాడు.
చెరువు లోతుగా వుండటంతో అతన్ని రక్షించడానికి ఎవ్వరూ సాహసం చేయలేక పోయారు. ఇంతలో ఒకరు ముందుకొచ్చి అక్కడున్నవాళ్ళు వద్దని వారిస్తున్నా వినకుండా చెరువులోకి దూకి, మునిగిపోతున్న అతన్ని అతి కష్టం మీద కాపాడి పైకి తీసుకొచ్చాడు.
ఓ టి.వి ఛానల్ వారికి ఈ సంఘటన ఎలా తెలిసిందో గాని అక్కడ జరిగినదంతా కెమెరాలో బంధించారు.
"ఎంతో సాహసం చేసి, ఓ నిండు ప్రాణాల్ని కాపాడావు....మానవత్వానికి కొత్త అర్థం చెప్పావు" ఇంకా అతనికి అర్థంకాని పెద్ద పెద్ద మాటలతో ఆ వ్యక్తిని పొగిడింది టి.వి యాంకర్.
"మానవత్వమా... పాడా ఇతను నా దగ్గర పదివేలు అప్పు తీసుకున్నాడు.... అందుకోసం ఇంత సాహసం చేయాల్సి వచ్చింది" అసలు విషయం చెప్పాడు.
చెరువు లోతుగా వుండటంతో అతన్ని రక్షించడానికి ఎవ్వరూ సాహసం చేయలేక పోయారు. ఇంతలో ఒకరు ముందుకొచ్చి అక్కడున్నవాళ్ళు వద్దని వారిస్తున్నా వినకుండా చెరువులోకి దూకి, మునిగిపోతున్న అతన్ని అతి కష్టం మీద కాపాడి పైకి తీసుకొచ్చాడు.
ఓ టి.వి ఛానల్ వారికి ఈ సంఘటన ఎలా తెలిసిందో గాని అక్కడ జరిగినదంతా కెమెరాలో బంధించారు.
"ఎంతో సాహసం చేసి, ఓ నిండు ప్రాణాల్ని కాపాడావు....మానవత్వానికి కొత్త అర్థం చెప్పావు" ఇంకా అతనికి అర్థంకాని పెద్ద పెద్ద మాటలతో ఆ వ్యక్తిని పొగిడింది టి.వి యాంకర్.
"మానవత్వమా... పాడా ఇతను నా దగ్గర పదివేలు అప్పు తీసుకున్నాడు.... అందుకోసం ఇంత సాహసం చేయాల్సి వచ్చింది" అసలు విషయం చెప్పాడు.
Saturday, 2 May 2015
Subscribe to:
Posts (Atom)