ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం అంటే మృత్యుశకటాలలో యమపురికి ప్రయాణం చేయడమే. గత కొంత కాలంగా బస్సు ప్రమాదాలు చూస్తుంటే నిజమేనని పిస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయానించాలంటే అరచేతిలోప్రాణాలు పెట్టుకోవాల్సినదేనని ప్రస్ఫుటం చేస్తున్నాయి."ఆర్టీసీబస్సుల్లోప్రయాణించడంక్షేమకరం..సురక్షతప్రయాణంకోసంఆర్టీసీలోప్రయానిం చండి' అంటూ ఢంకా బజాయించే ఆర్టీసీ యాజమాన్యం డ్రైవర్లను కట్టడం చేయడంలోపూర్తిగావిఫలమవుతోంది. ని ర్లక్షంగా డ్రైవింగ్ చేయడం, డ్రైవింగ్ చేస్తూ సెల్ మాట్లాడటం, బస్సును స్టేజీలలో ఆపక పోవడం వల్ల ఎక్కువ ప్రమాదాలుజరుగుతున్నాయి. డ్రైవర్స్ దూకుడికి కొందరు ప్రాణాలు పోగొట్టుకుంటే , మరికొందరు వికలాంగులుగా మారుతున్నారు. కొందరు డ్రైవర్స్ ట్రాఫిక్ సిగ్నల్ కూడా లెక్కచేయరు. ప్రమాదాలు జరిగినప్పుడు సంఘటనా స్థలంలో బస్సును వదిలేసి పారిపోయి యూనియన్లను ఆశ్రయించడం జరుగుతోంది. వెనుక ఆర్టీసీ బస్సు వస్తుందంటే ద్విచక్రవాహనదారులగుండెల్లోగుబు లు మొదలయ్యే పరిస్థితి నెలకొంది. ఇలా అమాయక ప్రజలను పొట్టన పెట్టుకుంటున్న సంఘటనలు డ్రైవర్స్ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం. బస్సు కదిలే సమయంలోనే కొందరు డ్రైవర్స్ కావాలనే వేగం పెంచడంతో చాలా మంది ప్రయాణికులు వెనుక చక్రాల కింద పడి మరణిస్తున్నారు. వీరిని ఆ యముడే భూలోకానికి 'యమదూతలు 'గా పంపించినట్టుంది. ఇన్నిప్రమాదాలు జరుగుతున్నా డ్రైవర్స్ లో కొంచమైన కరుణ, జాలి కనిపించదు . పైగా వాళ్ళ ఇష్ట ప్రకారం బస్సును డ్రైవింగ్ చేస్తుంటారు . ఇలా ప్రమాదాలు జరుగుతుంటే, ఆర్టీసీ యాజమాన్యం దృష్టి పెట్టకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.