తెలుగు ఇండస్ట్రీలో చిన్న చిన్న పాత్రలతో తన కెరీర్ మొదలు పెట్టి, హీరోగా ఎదిగిన రియల్ స్టార్ శ్రీహరి ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూసాడు. ఆయన గత కొంతకాలంగా కాలేయ సంబంధ వ్యాధితో భాద పడుతున్నట్లు సమాచారం. తెలుగు చలన చిత్ర రంగం ఒక మంచి నటుణ్ణి కోల్పోయింది.