”శోధిని”

Sunday 16 February 2014

అహంకారం ... అనేక అనర్థాలకు మూలకారణం !




అహం, అసూయ  కలవారికి 'ఇగో' కుడా ఎక్కువే!  వారు చెప్పేదే వేదంగా ... అందరూ  పాటించాలని నిర్దేశిస్తారు.  ఇలాంటి వాళ్ళు పలు సమస్యలను ఎదుర్కోవడమే కాకుండా చుట్టుప్రక్కల వారికి కుడా అనేక  సమస్యలను తెచ్చి పెడుతుంటారు.  అసూయా ద్వేశాలనేవి మానవ ప్రగతికి అడ్డుగోలగా  నిలిచి మన అభివృద్ధికి అవరోధంగా మారతాయనే సత్యాన్ని గుర్తుంచుకోవాలి.  అహంకారం విడిచిపెట్టి చూస్తే, చుట్టూ వున్న  ఆనందం మనకు ఎంతో అందంగా కనిపిస్తుంది.  అహంకారంతో వ్యవహరిస్తే మన చుట్టూవున్న వారి ప్రేమను కోల్పోవడం  ఖాయం.  అహంకారం మనిషిని  పాతాలలొకానికి  తొక్కేస్తుంది.  అంతేకాకుండా సర్వరొగాలకు మూల కారణమవుతుంది.  దీనివల్ల మనిషి అభద్రతా భావనకు లోనయ్యే అవకాశముంది.  అలాకాకుండా ఉండాలంటే, ఆత్మపరిశీలనతో అసూయను అధికమించే ప్రయత్నం నిరంతరం కొనసాగించాలి.  మనిషిలో స్వార్థం పెరిగితే దాని ద్వారా క్రూరత్వం కుడా పుట్టుకొస్తుంది.  దాన్ని దూరం చేసుకోవాలంటే ముందుగా  స్వార్థాన్ని విడనాడాలి.  అప్పుడే మనసుకు ప్రశాంతత లభిస్తుంది.  అందుకోసం ప్రతి ఒక్కరూ అహంకారాన్నిపూర్తిగా  విడనాడాలి .... అసూయా ద్వేశాలకు చాలా దూరంగా ఉండాలి!